Acharya Pramod Krishnam: కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లే, ఆయన ఇండియా కూటమికి ‘‘పిండప్రధానం’’ చేస్తారని కల్కిథామ్ పీఠాధీశ్వర్ ప్రమోద్ కృష్ణం విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని గొడవల్ని ఆయన ప్రస్తావించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇండియా కూటమి నాయకత్వంపై చర్చ జరుగుతున్న వేళ ఆయన నుంచి ఈ విమర్శలు వచ్చాయి.
కాంగ్రెస్‌ని అంతం చేసిన తర్వాత ఇప్పుడు ఇండియా కూటమి పని పూర్తి చేస్తాడని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశస్వాతంత్య్రంలో కీలక పాత్ర పోషించిన 150 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎలాంటి మద్దతు లభించడం లేదని, కాంగ్రెస్ పని ఖతమైందని అన్నారు. రాహుల్ గాంధీని ఇండియా కూటమి తమ నేతగా ఎన్నుకున్నాయి, అయితే త్వరలోనే ఆయన ఇండియా కూటమికి ‘పిండం’ పెడుతారని అన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ని బ్రిటీష్ వారు కూడా అంతం చేయలేకపోయారు, కానీ రాహుల్ గాంధీ 15 ఏళ్లలో కాంగ్రెస్‌ని అంతం చేశాడని ఆరోపించారు.