Abhishek Rao’s custody extended in Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ), ఈడీలు విచారణ కొనసాగిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన పలువురు ఉన్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అభిషేక్ రావును లిక్కర్ స్కామ్ లో సీబీఐ ఈ నెల 9న అరెస్ట్ చేసింది. మరుసటి రోజునే కోర్టు ముందు హాజరుపరిచారు. నేటితో అభిషేక్ రావు కస్టడీ ముగిసింది. అయితే మరికొంత సమయం కావాలని కోర్టును కోరింది సీబీఐ. దీంతో కోర్టు మరో రెండు రోజుల పాటు కస్టడీని పొడగించింది.
Read Also: Tammineni Veerabhadram: బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోంది.. అదో ప్రమాదకరమైన సంస్థ
ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించింది సీబీఐ, ఈడీ. అభిషేక్ రావును మూడు రోజుల పాటు ఈడీ విచారించింది. ఈ స్కామ్ లో రామచంద్ర అరుణ్ పిళ్లైని విచారించిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైతో అభిషేక్ రావుకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. అరుణ్ పిళ్లైకి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని.. అయితే ఇంట్లో ఏదో కార్యక్రమం ఉండటంతో, అతని కూతురు అనారోగ్యం కారణంగా పిళ్లై హాజరుకాలేదని సీబీఐ, కోర్టుకు తెలిపింది. మరికొన్ని ఆధారాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని సీబీఐ తెలిపింది. కస్టడీ అవసరం లేదని.. ఈ కేసులో కస్టడీ లేకుండా విచారించవచ్చని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. విచారణకు అన్ని విధాల సహకరిస్తున్నామని అభిషేక్ తరుపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ ఎక్సైజ్ పాలసీ ఈ లిక్కర్ స్కామ్ కు కారణం అయింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. పలుమార్లు సిసోడియాకు సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లు, బ్యాంకు లాకర్లను తనిఖీ చేసింది సీబీఐ. ఈ కేసులో తెలంగాణలోని కొంతమంది పారశ్రామికవేత్తల ప్రమేయం ఉందని.. హైదరాబాద్ కేంద్రంగానే ఈ స్కామ్ జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది.
