Site icon NTV Telugu

Abhishek Banerjee: లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది.. మళ్లీ ఎన్నికలు పెట్టాలన్న అభిషేక్ బెనర్జీ

Abhishek Banerjee

Abhishek Banerjee

ఎన్నికల సంఘంపై విపక్ష పార్టీలు యుద్ధం సాగిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. తిరిగి లోక్‌సభ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: Rajasthan: సుప్రీంకోర్టు బాటలోనే హైకోర్టు.. తక్షణమే వీధి కుక్కలు తొలగించాలని ఆదేశం

బీహార్‌లో 65 లక్షలు ఓట్లు తొలగించారని.. ఇలాంటి పరిస్థితే పశ్చిమ బెంగాల్‌లో చేపడితే లక్ష మందితో ఈసీ ఆఫీస్ ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తప్పులతో కూడిన ఓటర్ల జాబితాతో గత ఎన్ని్కల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాలు ఇలాగే ఎన్నికయ్యారని తెలిపారు. లోక్‌సభను రద్దు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తృణమూల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలందరూ అందుకు సిద్ధమేనని చెప్పారు. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో ఓటర్‌ జాబితాలు సరిగ్గానే ఉన్నాయని.. బెంగాల్‌, బిహార్‌లో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ ఎలా చెబుతుందని ప్రశ్నించారు. బీహార్‌లో న్యాయబద్ధంగా ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోవడం ఖాయమని తెలిపారు.

ఇది కూడా చదవండి: Ayodhya: రామమందిరం చుట్టూ రక్షణ గోడ.. భారీగా బడ్జెట్ కేటాయింపు

మా ప్రాధాన్యత బెంగాల్ అని.. మాకు ఎవరు అండగా నిలిచినా.. మేము కూడా వారికి అండగా నిలుస్తామని ప్రకటించారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చని చెప్పారు. మా లక్ష్యానికి మద్దతు ఇస్తే మాకు అభ్యంతరం లేదన్నారు. పార్టీలు మా కోసం రెండు అడుగులు వేస్తే.. మేము కూడా వారి కోసం అలాగే చేస్తామన్నారు. మాకు ఎటువంటి అహంకారం లేదని… మేము అధికార బీజేపీకి మాత్రమే వ్యతిరేకం అన్నారు. మొదటి నుంచి ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నామన్నారు.

Exit mobile version