Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత..
- అభిజిత్ దీప్కేపై మహిళ సిరా దాడి..
- మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijit Deepke: నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ నిరసన తెలుపుతోంది. మరోవైపు, ఇదే డిమాండ్‌తో ప్రముఖ కార్యకర్త సోనమ్‌వాంగ్ చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం సోనమ్‌వాంగ్ చుక్ దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. దీంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.
సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేపై ఒక మహిళ సిరా విసరడంతో మరింత గందరగోళం చెలరేగింది. దీపక్ వేదికపై నుంచి నిరసనకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటన తర్వాత ఇంక్ దాడికి పాల్పడిన మహిళలను పోలీసులకు అప్పగించారు. పోలీసులు మహిళను విచారిస్తున్నారు. ఈ దాడిపై దీప్కే స్పందిస్తూ, తనకు ఇష్టమైన కలర్ బ్లూ అని, జై భీమ్ అంటూ నినాదాలు చేశారు.
Also Read
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
సోనమ్ వాంగ్ చుక్ దీక్ష భగ్నం తర్వాత తక్షణమే తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఎక్స్‌లో దీప్కే ప్రకటించారు. జూలై 20న జరగాల్సిన ‘‘పార్లమెంట్ మార్చ్’’ యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉందని, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల దృష్ట్యా, నిపుణులైన వైద్యుల సలహా మేరకు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిరసన స్థలాన్ని శాంతియుతంగా ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
Blue is my colour… Jai Bhim! pic.twitter.com/SItr64em29
— Abhijeet Dipke (@abhijeet_dipke) July 18, 2026
తాజావార్తలు
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..