Abhijeet Dipke: కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. నాలుగు సార్లు చెంపదెబ్బలు
- కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి
- నాలుగు సార్లు చెంపదెబ్బలు
- దుండగుడిని చితకబాదిన నిరసనకారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పార్టీ అధినేత అభిజీత్ దీప్కేపై ఓ వ్యక్తి దాడి చేశాడు. నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంటనే నిరసనకారులు.. దుండగుడిని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమాచారం ప్రకారం.. జైపూర్‌లోని షహీద్ స్మారక్ దగ్గర కాక్రోచ్ పార్టీ నిరసన కార్యక్రమం ప్రారంభంకాక ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. అభిజీత్ దీప్కే కార్యక్రమ స్థలానికి చేరుకుని అక్కడికి వచ్చిన మద్దతుదారులకు అభివాదం చేస్తుండగా.. జనసమూహంలో ఉన్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు వచ్చి వరుసగా నాలుగు సార్లు చెంపదెబ్బలు కొట్టాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు వెంటనే దాడి చేసిన వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని నియంత్రించారు. ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడి వెనుక ఉన్న కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also Read
- Karnataka: మైసూర్ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
- Kundu couple: దీదీ తృణమూల్‌ను తుత్తునకలు చేసిన కుందు దంపతులు? ఒక సాదాసీదా పార్టీని లోక్‌సభలోనే కింగ్ మేకర్‌గా ఎలా మార్చారు!
- PM Modi: స్లోవేకియాలో మోడీ పర్యటన.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- PM Modi: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై మోడీ కీలక వ్యాఖ్యలు..
అవినీతి, నీట్ పేపర్ లీకేజీలపై నిరసన
పరీక్షల అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి సమస్యలపై కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. నిరసనకారులు అవినీతి వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే యువత సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా నిరసనకారులు నినాదాలు చేశారు.
VIDEO | Rajasthan: CJP founder Abhijeet Dipke slapped by unknown men during party's protest in Jaipur.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/45RUNmm9AG
— Press Trust of India (@PTI_News) June 15, 2026
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా బిగ్ అప్డేట్.. 140 కొత్త వాహనాలకు గ్రీన్ సిగ్నల్.!
-
Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత
-
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
-
Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
-
Divyendu Sharma: ‘పెద్ది’ విలన్‌కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?