NTV Telugu Site icon

AAP: ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ని తీసేయాలి.. కాంగ్రెస్‌కి ఆప్ 24 గంటల అల్టిమేటం..

Aap Vs Congress

Aap Vs Congress

AAP: ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరుగునున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. కాంగ్రెస్ నాయకుడు అజయ్ మాకెన్ ఆప్, అరవింద్ కేజ్రీవాల్‌ని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అజయ్ మాకెన్‌ని 24 గంటల్లో తొలగించాలని ఆప్ అల్టిమేటం విధించింది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్‌ని తొలగించాలని ఇతర పార్టీలను కోరుతామని ఆప్ నేతలు చెప్పారు.

ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీకి సాయం చేస్తుందని ఢిల్లీ సీఎం అతిషి ఆరోపించారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఇలాంటి ఆరోపనలే చేశారు. ‘బీజేపీకి ఎన్నికల్లో లాభం చేకూరేందుకు కాంగ్రెస్ అన్నీ చేస్తోంది. అజయ్ మాకెన్ బీజేపీ స్ర్కిప్ట్ చదవి, బీజేపీ ఆదేశాల మేరకు ప్రకటన చేస్తూ, బీజేపీ సూచనల మేరకు ఆప్ నేతల్ని టార్గెట్ చేస్తున్నారు. నిన్న అన్ని హద్దులు దాటి మా నేత అరవింద్ కేజ్రీవాల్‌ని దేశవ్యతిరేకిగా విమర్శించారు’’ అని సంజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ లేదా దాని నాయకులు ఏ బీజేపీ నేతలని కూడా యాంటీ-నేషనల్ అని పిలువలేదని చెప్పారు.

Read Also: Jani Master: పోలీసుల ఛార్జ్ షీట్.. జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే..!

ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఆప్-కాంగ్రెస్, కొన్ని నెలల్లోనే ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ చేతిలో కూటమి ఓటమి పాలైంది. ఏడు నియోజకవర్గాలను బీజేపీ గెలుచుకుంది. ‘‘అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. చండీగఢ్‌లో కూడా కాంగ్రెస్‌కు ప్రచారం చేశారు. పార్లమెంటులో సమస్యలపై ఆప్ పదేపదే కాంగ్రెస్‌తో నిలుస్తుంది.మీరు మా నాయకుడిని దేశవిరోధి అంటారు, యూత్ కాంగ్రెస్ అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుందా?’’ అంటూ సంజయ్ సింగ్ ప్రశ్నించారు.

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ అంగీకరించలేదనే విషయాన్ని ఆప్ నేత గుర్తు చయేశారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టు8కుంటున్నట్లు కాంగ్రెస్ చర్యలు మాటలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అతిషీ అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ ఎప్పుడైనా పోలీసులకు ఫిర్యాదు చేసిందా..? అని ఆమె ప్రశ్నించారు. ఢిల్లీలో కాలుష్యం, ప్రజలకు సదుపాయాలు, శాంతిభద్రతలపై ఆప్‌ని లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ బీజేపీ నిన్న 12 పాయింట్లతో శ్వేతపత్రం విడుదల చేయడంతో రెండు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. దేశంలో ఎవరైనా మోసాలకు రారాజు ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ అంటూ అజయ్ మాకెన్ విమర్శించారు.

Show comments