NTV Telugu Site icon

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలనం..ఈడీ ఛార్జీషీట్‌లో కేజ్రీవాల్ పేరు..

Ed

Ed

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ రెండో చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ మొత్తం కేసులో విజయ్ నాయర్ కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ ఛార్జీషీట్ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ అవినీతిని అడ్డుకునేందుకు పనిచేయడం లేదని.. ప్రభుత్వాలను కూల్చివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Read Also: FedEx Layoffs: ఉద్యోగులకు ఫెడ్‌ఎక్స్ షాక్..తామూ ఆ దారిలోనే అంటూ!

ఇదిలా ఉంటే మరో కీలక విషయాన్ని కూడా ఛార్జీషీటులో ప్రస్తావించింది. గతేడాది గోవా ఎన్నికల సమయంలో లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బును ఆప్ ఉపయోగించినట్లు ఈడీ పేర్కొంది. గోవాలో ఆప్ తరుపున సర్వే చేసిన వాలంటీర్లకు దాదాపుగా రూ. 70 లక్షల నగదును చెల్లించినట్లు తెలిపింది. ఈ ఎన్నికల్లో ఆప్ రెండు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్ నాయర్, ప్రచారానికి సంబంధించిన పనిచేసిన వ్యక్తులకు నగదు రూపంలోనే తీసుకోవాలని చెప్పారని ఈడీ ఆరోపించింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్‌పల్లి, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహాయకుడు దినేష్ అరోరాతో కలిసి కుట్రపన్ని నగదు బదిలీకి సహకరించారని ఈడీ తెలిపింది.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో జరిగిన అవకతవకలపై ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ వినయ్ కుమార్ సక్సోనా సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. దీంతో ఈ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నవంబర్ 17, 2021 నుంచి జూలై, 2022 అమలైన ఈ కొత్త లిక్కర్ స్కాంను సీబీఐ విచారణ అనంతరం ఢిల్లీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీస్ సిసోడియా పేరు కూడా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది.