Site icon NTV Telugu

AAP: మిత్రపక్షాల మధ్య విభేదాలు.. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదన్న ఆప్

Punjabcmbhagwantmann

Punjabcmbhagwantmann

త్వరలో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఇండియా కూటమిలోని మిత్రపక్షాల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా కనిపిస్తోంది.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుందని.. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ ఉండబోదని వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆప్, కాంగ్రెస్ మధ్య పొసగడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. హర్యానాలో జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీలు దోచుకున్నాయని మాన్ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా కన్ఫామ్..

2024 లోక్‌సభ ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన రెండు సీట్లు అంబాలా, సిర్సాతో సహా 10 సీట్లలో ఐదు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక జాట్‌ల ఆధిపత్యం ఉన్న మూడు స్థానాలైన సోనేపట్, రోహ్‌తక్, హిసార్ కూడా గెలుచుకుంది. ఓబీసీలు, అగ్రవర్ణాల మద్దతు కారణంగా కర్నాల్, ఫరీదాబాద్, గుర్గావ్, భివానీ-మహేంద్రగఢ్, కురుక్షేత్రలో బీజేపీ విజయం సాధించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 58.20 శాతంగా ఉన్న బీజేపీ ఓట్ల శాతం 2024 నాటికి 46.11 శాతానికి పడిపోయింది.

ఇక తాజాగా 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఇండియా కూటమినే ఓట్ షేర్ మెరుగ్గా ఉంది. ప్రతిపక్ష కూటమి 47.61 శాతం ఓట్ షేర్‌ను సాధించింది. తొమ్మిది స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు 43.67 శాతం ఓట్లు వచ్చాయి. కురుక్షేత్ర స్థానంలో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 3.94 శాతం వాటానే కైవసం చేసుకుంది.

ఇది కూడా చదవండి: Minister Narayana: త్వరలో రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం..

Exit mobile version