NTV Telugu Site icon

AAP: కాంగ్రెస్‌ని మరోసారి దెబ్బతీసిన ఆప్.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీకి మద్దతు..

Aap Congress

Aap Congress

AAP: అతివిశ్వాసంతో కాంగ్రెస్ హర్యానాని చేజేతుల చేజార్చుకుంది. తామే గెలుస్తామనే అతి నమ్మకంతో ఆప్ పార్టీలో పొత్తు పెట్టుకోలేదు. దీంతో బీజేపీ వ్యతిరేక ఓటును ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీల్చగలిగింది. దీంతో కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ ఓట్లతో బీజేపీ కన్నా 11 సీట్లను వెనకబడింది. ఈ ఎన్నికల్లో ఆప్ 1.79 శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిస్తే, కాంగ్రెస్ 37 స్థానాలు గెలిచి వరసగా మూడోసారి అధికారానికి దూరమైంది. ఆప్ అడిగిన స్థానాలు కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో హర్యానా ఎన్నికల్లో విడిగానే పోటీ చేసింది. పొత్తు పెట్టుకోకపోవడంపై కాంగ్రెస్‌ని దాని మిత్ర పక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.

Read Also: Minister Narayana: మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం..

ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్‌కి ఆప్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 46 మ్యాజిక్ ఫిగర్. ఈ ఎన్నికల్లో ఎన్సీ 42, బీజేపీ 29, కాంగ్రెస్ 06 సీట్లను గెలిచింది. అనూహ్యం ఆప్ నుంచి ఒకరు విజయం సాధించారు.

ఇప్పటికే ఎన్సీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తాజాగా ఆప్ ఎమ్మెల్యే , దోడా నియోజకవర్గం నుంచి గెలిచిన మెహ్రాజ్ మాలిక్ కూడా ఎన్సీకి మద్దతు తెలుపుతూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మద్దతు లేఖ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ లేకుండానే ఎన్సీ మ్యాజిక్ ఫిగర్ 46ని దాటింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. చాలా వరకు అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటాయి. కాంగ్రెస్‌తో ఏదైనా విభేదాలు వచ్చినా, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే ఎన్సీ సర్దుకుంటోంది.

Show comments