NTV Telugu Site icon

Delhi: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎంపికకు ముహూర్తం ఫిక్స్!.. ఎప్పుడంటే..!

Cmkejriwal

Cmkejriwal

దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ విడుదలైన తర్వాత హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కేజ్రీవాల్ కలిసి రాజీనామా సమర్పించనున్నారు.

ఇది కూడా చదవండి: Nipah Virus: స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి..”నిపా వైరస్” గుప్పిట మలప్పురం..

ఇదిలా ఉంటే కేజ్రీవాల్ రాజీనామాతో కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ వారసుడు ఎవరనేదానిపై చర్చావేదికలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం అభ్యర్థి ఎంపికపై ఆప్ ముహూర్తం ఖరారు చేసింది. ఉదయం 11:30కి ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేజ్రీవాల్ వారసుడిని ఎంపిక చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసిన తర్వాత సాయంత్రం ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Kolkata: సీఎం మమతతో చర్చలకు జూడాలు అంగీకారం

ఇదిలా ఉంటే సీఎం రేసులో ఆప్ నుంచి పలువురు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా సునీతా కేజ్రీవాల్, రాఘవ్ చద్దా, అతిషి, సౌరభ్ భరద్వాజ్ పేర్లు ప్రముఖంగా వినిస్తున్నాయి. వీరితో పాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ నలుగురిలో ఎవరికొకరికి అవకాశం దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోసారి అధికారంలోకి రావాలంటే.. చాలా కీలకంగా వ్యవహారించాలి. దీంతో కేజ్రీవాల్ ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Fraud: హిందువుగా నటించి మహిళతో పెళ్లి.. ఆ తర్వాత మతం మారాలని ఒత్తిడి..

ఇక సోమవారం కేజ్రీవాల్ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన సమావేశానికి సీనియర్ ఆప్ నేతలు, మంత్రులు హాజరయ్యారు. ఇక కొత్త సీఎం ఎంపిక విషయంలో మంత్రులందరితో విడివిడిగా చర్చించినట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యేలతో కూడా కేజ్రీవాల్ చర్చించి.. ముఖ్యమంత్రిని ఎంపిక చేయనున్నారు. మొత్తానికి కేజ్రీవాల్ వారసుడి ఎవరన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.