NTV Telugu Site icon

BJP: ఢిల్లీలో ఆప్‌కు బీజేపీ షాక్.. హజ్ కమిటీ చైర్మన్‌గా కౌసర్ జహాన్

Delhi Haj Comittee

Delhi Haj Comittee

Delhi Haj Committee election: ఢిల్లీలో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ హజ్ కమిటీపై ఆప్ అధికారాన్ని కోల్పోయింది. హజ్ కమిటీ చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన కౌసర్ జహాన్ విజయం సాధించారు. ఢిల్లీ చరిత్రలోనే ఓ మహిళ చైర్మన్ పదవిని చేపట్టడం ఇది రెండోసారి మాత్రమే. గత కొంత కాలంలో ఢిల్లీ హజ్ కమిటీపై ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేదని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Read Also: Thyroid Diseases: థైరాయిడ్ కు మునగాకుతో చెక్..

ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ హజ్ కమిటీపై నియంత్రణ కోల్పోవడం ఇదే తొలిసారి. కౌసర్ జహాన్ కు ముందు ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ తాజ్దార్ బాబర్ ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఏకైక మహిళ. తాజాగా జరిగిన ఎన్నికల్లో సభ్యుల్లో మహ్మద్ సాజ్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ జహాన్ కు మద్దతుగా నిలిచారు. ‘‘ఢిల్లీ హజ్ కమిటీ చైర్మన్‌గా ఎన్నికైన కౌసర్ జహాన్‌కు అభినందనలు.. ఢిల్లీ హజ్ కమిటీలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంతో దేశాభివృద్ధిలో ముస్లిం సమాజం కూడా భాగస్వామ్యమైందనే విషయం స్పష్టమైంది’’ అంటూ ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా ట్వీట్ చేశారు.

హజ్ కమిటీ సభ్యులలో బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు అబ్దుల్ రెహ్మాన్, హాజీ యూనస్, కాంగ్రెస్ కౌన్సిలర్ నజియా డానిష్, ముస్లిం మతశాస్త్ర నిపుణుడు మహ్మద్ సాద్, కౌసర్ జహాన్ లు ముస్లిం స్వచ్ఛంద సంస్థల సభ్యులుగా ఉన్నారు. భారతీయ ముస్లింలు హజ్ కమిటీ సమన్వయంతో ప్రతి సంవత్సరం తీర్థయాత్రలో పవిత్రమైన మక్కాకు వెళతారు. ఇదిలా ఉంటే మరోవైపు ఢిల్లీ నగర మేయర్ ఎన్నిక ఇప్పటికీ ముగియడం లేదు. బీజేపీ, ఆప్ పార్టీల మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి.