NTV Telugu Site icon

Swati Maliwal: సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఆప్ నేత స్వాతి మలివాల్‌పై దాడి..?

Swatimaliwal

Swatimaliwal

Swati Maliwal: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత స్వాతి మలివాల్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రావాల్ నివాసంలో దాడి జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తనను తాను స్వాలి మలివాల్‌గా చెప్పుకుంటూ ఓ మహిళ నుంచి ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూం(పీసీఆర్)కి కాల్స్ వెళ్లాయి. ఈ రెండు కూడా సివిల్ లైన్స్‌లోని సీఎం కేజ్రీవాల్ నివాసం నుంచి వచ్చినట్లు సమాచారం. దాడికి గురైన తర్వాత అత్యవసర సేవల కోసం ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.

Read Also: Maldives: భారత్ ఇచ్చిన విమానాలను మా పైలట్లు నడపలేరు.. మాల్దీవుల రక్షణ మంత్రి కామెంట్స్..

పోలీస్ వర్గాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు కాల్ వచ్చింది. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా స్వాతి మలివాల్ కనిపించలేదు. ప్రోటోకాల్ ప్రకారం, చట్టాన్ని అమలు చేసే అధికారులు సరైన అనుమతి లేకుండా ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించలేదు. ఢిల్లీ పోలీసులు పీసీఆర్ కాల్ వాస్తవికతను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పర్సనల్ అసిస్టెంట్(పీఏ) తనపై సోమవారం దాడి చేశారని రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్వాలి మలివాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసంలో పీఏ విభవ్ కుమార్ కొట్టారని ఢిల్లీ మహిళా కమిషర్ మాజీ చైర్‌పర్సన్ ఆరోపించారు.

ఈ వ్యవహారంపై బీజేపీ విరుచుకుపడుతోంది. మలివాల్‌పై దాడి ఆరోపణపై ఆప్‌పై ధ్వజమెత్తింది. పార్టీ అధినేత కేజ్రీవాల్ మలివాల్ మౌనం వహించారని అన్నారు. బీజేపీ నేత అమిత్ మాల్వియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. ‘‘ఢిల్లీ సీఎం పీఏ తనపై దాడి చేశారని ఆప్ ఆర్‌ఎస్ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చీఫ్ స్వాతి మలివాల్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం ఇంటి నుంచి కాల్ చేశారు. కేజ్రీవాల్ అరెస్టుపై స్వాతి మలివాల్ రేడియో మౌనం వహించారని గుర్తుంచుకోండి. ఆమె నిజానికి ఆ సమయంలో భారతదేశంలో కూడా లేదు మరియు చాలా కాలం వరకు తిరిగి రాలేదు’’ అని ట్వీట్ చేశారు.

బీజేపీ మరో నేత కపిల్ మిశ్రా ఎక్స్ వేదికగా ఆప్‌ని ప్రశ్నించారు. ‘‘కేజ్రీవాల్ పీఏ స్వాలి మలివాల్‌ని కొట్టారా..? ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై స్పష్టత ఇస్తుందా..? ముఖ్యమంత్రి ఇంట్లో రాజ్యసభ మహిళా ఎంపీని కొట్టారనే వార్తలు అవాస్తవం కావాలని దేవుడిని ప్రార్థిస్తాను’’ అంటూ ట్వీట్ చేశారు.