AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
- హర్భజన్ సింగ్‌కు కేంద్ర భద్రత..
- బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలకు సీఆర్పీఎఫ్ సెక్యూరిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP Crisis: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా భారీ షాక్ ఇచ్చారు. చద్దాతో సహా ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామంతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. అయితే, ఈ పరిణామం తర్వాత పంజాబ్‌లోని ఆప్ కార్యకర్తలు మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్‌ను టార్గెట్ చేసుకున్నారు. పంజాబ్ ఆప్ ప్రభుత్వం ఆయనకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. దీనికి ముందు ఆయన ఇంటిపై ఆప్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. పంజాబ్ ద్రోహి అంటూ ఇంటి గోడలపై నల్ల సిరాతో రాశారు.
Read Also: Grok’s Reply: రాహుల్ గాంధీ పరువు తీసిన గ్రోక్.. ప్రధానిగా మోడీకి మద్దతు..
Also Read
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- Mu*rder: భార్య కోసం నరబలి.? వ్యక్తిని హత్య చేసి తలను పూజా గదిలో దాచిన హంతకుడు.!
- Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర...వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
ఈ పరిణామాలు జరిగిన కొద్ది గంటలకే కేంద్ర ప్రభుత్వం హర్భజన్ సింగ్‌కు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. ఇకపై ఆయనకు ఢిల్లీలో, పంజాబ్‌లో కేంద్ర భద్రత లభిస్తుంది. ఆయనను రక్షించేందుకు సీఆర్పీఎఫ్ కమాండోలు మోహరించారు. హోం శాఖ వర్గాల ప్రకారం.. హర్భజన్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఇతర ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టర్, స్వాతి మాలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ జీత్ సహానీలకు కూడా కేంద్ర భద్రత కల్పించారు. వీరందరికి ఇకపై సీఆర్పీఎఫ్ భద్రత ఉంటుంది.
ఆదివారం ఉదయం పంజాబ్ ప్రభుత్వం హర్భజన్‌కు ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. జలంధర్‌లో ఆయన నివాసం నుంచి సెక్యూరిటీ సిబ్బంది, ప్రభుత్వ వాహనాలను తొలగించారు. ఈ విషయాన్ని హర్భజన్ పీఏ మన్‌దీప్ సింగ్ ధ్రువీకరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పార్టీని వీడిని ఎంపీలను ద్రోహులుగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
-
HYDRAA : మురుగు చెరువు నుంచి టూరిజం స్పాట్.. సున్నం చెరువు సరికొత్త లుక్.!
-
150 Words on One Sticky Note: ఒకే స్టిక్కీ నోట్‌పై 150 పదాలు.. భారత సంతతి క్లౌడ్ ఇంజనీర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు!
-
AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
-
England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?