Site icon NTV Telugu

Operation Lotus: మరో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర..! రూ.1,375 కోట్లతో బీజేపీ ప్లాన్..!

Operation Lotus

Operation Lotus

వరుసగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి.. తమ సర్కార్‌ను భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తూ వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.. ఇక, ఈ మధ్య, మరో రెండు మూడు రాష్ట్రాల్లో పరిస్థితులను ముందుగానే ఆ రాష్ట్రాల సీఎంలు పసిగట్టి.. వారికి చెక్‌ పెట్టే విధంగా ఫ్లోర్‌ టెస్ట్‌ కూడా నిర్వహించారు.. అందులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒకరైతే.. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరొకరు.. అయితే, ఆ రాష్ట్రాల్లో తమ ఎత్తులో చిత్తు కావడంతో.. ఇప్పుడు మరో రాష్ట్రాంలో బీజేపీ కుయుక్తులు పన్నినట్టు.. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది.. పంజాబ్‌లోని ఆప్‌ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి హర్పాల్‌ చీమా ఆరోపించారు. అంతేకాదు.. తమ సర్కార్‌ను పడగొట్టేందుకు బీజేపీ ఏకంగా రూ.1,375 కోట్లు ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ప్రయత్నించారని తెలిపారు.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

గతంలో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఇలాంటి ప్లానే చేసిందని.. ఇప్పుడు పంజాబ్‌లోనూ అదే పని చేస్తోందని మండిపడ్డారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా… మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను తమకు మద్దతు ఇచ్చేలా చేసే ప్రయత్నాల్లో భాగంగా.. అందులో ఏడుగురిని నేరుగా.. లేదా మూడో వ్యక్తి ద్వారా సంప్రదించారని విమర్శించారు.. మరోవైపు.. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కూడా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు మొత్తం రూ.1,375 కోట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమైందని సంచలన ఆరోపణలు చేశారు.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆఫర్ చేశారని ఆరోపణలు గుప్పించారు.. కాగా, ఢిల్లీలోనూ బీజేపీపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.. అయితే, ఆప్‌ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడ్డ ఆ పార్టీ.. అసెంబ్లీ వేదికగా బలనిరూపణ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్‌లోనే ఆప్‌ సర్కార్‌ను బీజేపీ టార్గెట్‌ చేస్తుందని.. ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version