Site icon NTV Telugu

Kejriwal: బైపోల్స్ విజయంతో ఆప్‌లో జోష్.. రాజ్యసభకు కేజ్రీవాల్!

Kejriwal2

Kejriwal2

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. పార్టీ కార్యక్రమాలు అంత చురుగ్గా కనిపించడం లేదు. కార్యకర్తలు కూడా నిరాశలోకి వెళ్లిపోయారు. ఇలాంటి తరుణంలో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలతో సరికొత్త జోష్ తీసుకొచ్చింది. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో బైపోల్స్ జరిగాయి. సోమవారం వెలువడిన ఫలితాల్లో గుజరాత్‌లో ఒకటి, పంజాబ్‌లో ఒక స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ తీసుకొచ్చింది.

ఇది కూడా చదవండి: Iran-Israel: ఫోర్డో అణు కేంద్రం లక్ష్యంగా ఇజ్రాయెల్ మరోసారి దాడి

తాజా ఫలితాలతో ఆప్‌ శ్రేణుల్లో కొత్త జోష్‌ తీసుకొచ్చిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్‌కు కొత్త బలాన్ని తీసుకొచ్చినట్లైంది. ఢిల్లీ ఫలితాలతో కేజ్రీవాల్ చాలా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా అంత చురుగ్గా పాల్గొన్న సంఘటనలు లేవు. అయితే తాజాగా వెలువడిన బైపోల్స్ ఫలితాలతో కొత్త ఊపు తీసుకొచ్చింది. దీంతో ఆయన పెద్దల సభకు వెళ్లడం ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. పంజాబ్ నుంచి ఆయన రాజ్యసభకు వెళ్లొచ్చని పొలిటికల్‌గా ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?

పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, గుజరాత్‌లోని విశావదర్‌లో ఆప్ భారీ విజయాలు సాధించింది. దీంతో గుజరాత్, పంజాబ్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించినందుకు ప్రజలకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కేరళలోని నీలంబర్‌ను గెలుచుకోగా, గుజరాత్‌లోని కడిని బీజేపీ కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని కాలిగంజ్‌ను టీఎంసీ తిరిగి దక్కించుకుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. బీజేపీ విజయం సాధించింది. తొలిసారి బీజేపీ నుంచి గెలిచిన రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఢిల్లీలో పరాజయం తర్వాత ఆప్‌లో జోష్ తగ్గింది. తిరిగి నాలుగు నెలల తర్వాత సరికొత్త జోష్ వచ్చింది. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు కేజ్రీవాల్ కసరత్తు చేస్తున్నారు. దీని ద్వారా జాతీయ రాజకీయాల్లో మళ్లీ స్పీడ్ అందుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Exit mobile version