ఆధార్ కార్డు.. దేశ పౌరులకు ముఖ్యమైన దృవపత్రంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా ఆధార్ ను ఇవ్వాల్సిందే. ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, సిమ్ కార్డ్స్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆధార్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆధార్ లేకపోతే ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేని పరిస్థితి. అయితే భారత్ లో ఇప్పటి వరకు ఆధార్ కార్డు జారీ చేయని రాష్ట్రం ఒకటి ఉందని తెలుసా? ఆ రాష్ట్ర పౌరులకు ఆధార్ కార్డులు లేవు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదని ఆలోచిస్తున్నారా? ఆ స్టేటే జమ్మూ కశ్మీర్. మరి ఇక్కడ ఆధార్ కార్డులు జారీ చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?
జమ్మూ కశ్మీర్ దేశంలో ఓ ప్రత్యేకత ఉన్న రాష్ట్రం. ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఈ ప్రాంతం భిన్నమైనది. ఇదే సమయంలో అత్యంత సున్నితమైన ప్రదేశం. ఎందుకంటే ఈ రాష్ట్రం శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో సరిహద్దులను పంచుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఉగ్రవాదులు, చొరబాటుదారుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఉగ్ర మూకలు ఈ ప్రాంతంలో దాడులకు పాల్పడుతుంటారు. భద్రతా బలగాలకు సవాల్ విసురుతుంటారు.
ఇక్కడ భద్రత కల్పించడం రక్షక దళాలకు కత్తిమీద సాములాంటిది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డుల జారీని నిషేధించారు. ఒక వేళ ఆధార్ కార్డులను జారీ చేస్తే.. దీన్ని అదునుగా తీసుకుని నకిలీ ఆధార్ కార్డులను సృష్టించుకుని చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నది. అందుకే జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డులను జారీ చేయలేదు. కానీ, అక్కడి ప్రజలకు గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర దృవపత్రాలను జారీ చేస్తారు.