Site icon NTV Telugu

Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..

Supreme Court

Supreme Court

Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్‌ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టు బుధవారం దీనిపై తుది వాదనలు ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం సర్ పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఆధార్‌ను పౌరసత్వానికి ప్రశ్నించలేని రుజువుగా పరిగణించలేము’’ అని స్పష్టం చేసింది.

Read Also: Tirumala Laddu Ghee Adulteration Case: తిరుమల కల్తీ నెయ్యి లడ్డు కేసులో మరో అరెస్టు !

ఓటర్‌గా నమోదు చేయడానికి ఉపయోగించే ఫారమ్ 6లోని ఎంట్రీల ఖచ్చితత్వాన్ని నిర్ణయించే స్వాభావిక అధికారం ఎన్నిక సంఘానికి ఉందని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. ఆధార్ కార్డ్ అనేది సంక్షేమ పథకాలు, సౌకర్యాలు పొందేందుకు మంజూరు చేయబడిందని, ఒక విదేశీయుడు ఆధార్ కార్డ్ కలిగి ఉంటే, అతడికి ఓటు హక్కు ఇవ్వాలా? వేరే దేశానికి చెందిన వాడు కార్మికుడిగా పనిచేస్తున్నారని అనుకుంటే, అతడికి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలా? అని సీజేఐ ప్రశ్నించారు.

సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనల్ని వినిపించారు. సర్ ప్రక్రియ సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని వాదించారు. వీరిలో చాలా మంది పేపర్ వర్క్ వల్ల ఇబ్బందులు పడొచ్చని, వారి ఓటు హక్కు తొలగించే ప్రమాదం ఉందని చెప్పారు. అయితే, ఇంతకు ముందు సర్ అనే ప్రక్రియ నిర్వహించకుంటే, ఈసీకి నిర్వహించే హక్కు లేదని చెప్పడం సరైందని కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Exit mobile version