NTV Telugu Site icon

Karnataka Crime: దృశ్యం-2 రిపీట్.. ప్రియుడితో కలిసి భర్తను గొంతుకోసి హత్య

Karnataka Crime

Karnataka Crime

Karnataka Crime: వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది కానీ పోలీసులకు దొరికి పోయింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు అసలు విషయం తెలిసి షాకయ్యారు. దృశ్యం-2 సినిమాను ఈ హత్య తలపిస్తోంది. ఈ ఘటన ఘటన బెంగళూరులోని సోలదేవనహళ్లిలో చోటుచేసుకుంది.

అసలు ఏం జరిగింది?
బెంగళూరులోని సోలదేవనహళ్లిలో దేశేగౌడ, జయలక్ష్మిభార్య భర్తలు నివాసం ఉంటున్నారు. 35 ఏళ్ల జయకు 16 ఏళ్ల క్రితం దేశేగౌడతో వివాహమైంది. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. దంపతులిద్దరూ ఓ వ్యవసాయ క్షేత్రంలో పని చేస్తున్నారు. అయితే భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలోనే జయకు రాజేష్‌ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ తర్వాత అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు ఎవరూ లేని సమయంలో దేశేగౌడ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. కొన్ని రోజులకు భార్య వివాహేతర సంబంధంపై భర్త దేశేగౌడకు అనుమానం వచ్చింది. ఇదే విషయమై దేశేగౌడ ఆదివారం రాత్రి భార్యతో గొడవ పడ్డాడు. అదే సమయంలో తన భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ వేసింది. ప్లాన్‌ ప్రకారం.. ప్రియుడు ఇంటి వెనుక ద్వారం నుంచి లోనికి ప్రవేశించి భర్తను గొంతు కోసి చంపేసింది. ఆవుల కొట్టంలో నుంచి తాడు తెచ్చి కాళ్లు, చేతులను దగ్గరికి లాగి తాళ్లతో కట్టేసి సంచిలో వేశారు.

Read also: Paritala Sriram: పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టిన పరిటాల రవి.. పరిటాల శ్రీరామ్ ఏం చెప్పారంటే..?

కారులో మృతదేహాన్ని రామనగర వద్దకు తీసుకెళ్లారు. మృతుడి ఫోన్‌ను నిర్జన ప్రదేశంలో పడేశారు. తర్వాత సాక్షులు దొరక్కుండా హత్యకు ఉపయోగించిన వస్తువులను ఒక్కొక్కటిగా నిర్జన ప్రదేశంలో విసిరేసింది. దేశేగౌడ మృతదేహాన్ని సోలదేవనహళ్లి ఫాంహౌస్ నుంచి కారులో తీసుకెళ్లారు. మైసూరు-బెంగళూరు హైవే పక్కన ఉన్న ఓ కాలువలో 50 మీటర్ల లోతులో మృతదేహాన్ని పాతి పెట్టారు. ఆ తర్వాత రోజు మహిళ తనకు ఏమీ తెలియనట్లుగా నటించింది. పోలీసులకు తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది.ఈకేసును సవాల్‌ గా తీసుకున్న పోలీసులు విషాలు తెలిసి షాక్‌ కు గురయ్యారు. భర్యే ప్రియుడితో కలిసి భర్తను చంపేసిందని దర్యాప్తులో నిజం తెలిసింది. రాంనగర్ జిల్లా కెంపేగౌడ దొడ్డి సమీపంలో దేశేగౌడ మృతదేహం లభ్యమైంది. ఆమెను, తన ప్రియుడిని అదుపులో తీసుకుని పోలీస్టేషన్‌ కు తరలించారు.
Himanta Biswa Sarma: “లవ్ జీహాద్” వాస్తవం.. దీనికి శ్రద్ధావాకర్ కేసు ఓ ఉదాహరణ..

Show comments