Site icon NTV Telugu

Karnataka High Court: భర్త నుంచి భరణం పొందడానికి సరైన కారణం చూపాలిః కర్ణాటక హైకోర్టు

Karnataka High Court

Karnataka High Court

Karnataka High Court: భర్త నుంచి భార్య భరణం పొందడం సర్వసాధారణం. అయితే భరణం పొందడంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. భర్త నుంచి భరణం పొందడానికి భార్య సరైన కారణం చూపాలని పేర్కొంది. పెళ్లయిన తరువాత భార్య ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చోకూడదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది. తన మెయింటెన్స్ కోసం కేవలం భర్త అందించే భరణంపై పూర్థి స్థాయిలో ఆధారపడకూదని పేర్కొంది. పెళ్లయిన తర్వాత భార్య ఖాళీగా కూర్చోకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. భార్యా బిడ్డలకు భర్త అందించే జీవనభృతిలో కోత విధించడంపై దాఖలైన కేసులో ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా భార్య ఎందుకు పని చేయలేకపోతుందో తెలపాలని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

Read also: Rajasthan: 17 బాలిక, 20 ఏళ్ల మహిళా టీచర్ మిస్సింగ్.. “లవ్ జిహాద్” అని ఆరోపణలు..

తనకు ఇచ్చిన భరణంలో కోత విధించడాన్ని సవాలు చేస్తూ భార్య కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును జస్టిస్ రాజేంద్ర బాదామికర్ తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. ఈ కేసును విచారించిన కోర్టు వివాహానంతరం భార్య ఎందుకు పనిచేయలేకపోయిందో సరైన వివరణ లేదని పేర్కొంది. ‘పెళ్లికి ముందు భార్య ఉద్యోగం చేస్తూ సంపాదించేదని.. ఇప్పుడు ఆమె ఖాళీగా కూర్చోకూడదని.. తన భర్త నుంచి మొత్తం మెయింటెనెన్స్ కోరరాదని సూచించారు. అలాగే తన జీవనోపాధి కోసం కొన్ని ప్రయత్నాలు చేయడానికి ఆమె చట్టబద్ధంగా కట్టుబడి ఉందని.. ఆమె తన భర్త నుండి సహాయక భరణాన్ని మాత్రమే కోరవచ్చునని హైకోర్టు పేర్కొంది.

Read also: Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్‌ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ

మేజిస్ట్రేట్ కోర్టు తనకు ఇచ్చిన భరణంలో కోత విధించడాన్ని సవాలు చేస్తూ భార్య ఈ పిటిషన్ దాఖలు చేసింది. సెషన్స్ కోర్టు (అప్పిలేట్ కోర్టు) దాఖలు చేసిన ఉత్తర్వుల ప్రకారం.. భరణం రూ .10,000 నుండి రూ .5,000 కు అలాగే పరిహారాన్ని రూ .3 లక్షల నుండి రూ .2 లక్షలకు తగ్గించారు. ఈ నేపథ్యంలో ఆమెకు మంజూరు చేసిన పరిహారం సరిపోదని పిటిషనర్ వాదించారు. సరైన సాకు లేకుండా సెషన్స్ కోర్టు భరణాన్ని తగ్గించిందని ఆమె తరపు న్యాయవాది వాదించారు. అత్తగారితో, సోదరితో ఉండేందుకు భార్య సుముఖంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. . తల్లి, సోదరి సంరక్షణ బాధ్యత భర్తపై ఉంటుందని కోర్టు పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

Exit mobile version