Site icon NTV Telugu

Rajasthan: మతి తప్పిన పదేళ్ల బాలుడు.. స్మార్ట్ ఫోన్‌కు బానిస కావడమే కారణం

Rajasthan

Rajasthan

Rajasthan: స్మార్ట్ ఫోన్‌ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ప్రతి ఒక్కరి నట్టింట్లోకి వచ్చింది.. చివరికి బెడ్‌రూమ్‌.. బాత్రూమ్‌లోకి సైతం చేరింది. స్మార్ట్ ఫోన్‌ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఇన్ఫర్మేషన్‌ కోసం ఉపయోగించుకుంటుంటూ.. మరికొందరు ఆన్‌లైన్‌ గేమ్స్ కోసం ఉపయోగిస్తున్నారు. మరికొందరు తమ వ్యాపార లావాదేవీలకు వినియోగిస్తున్నారు. ఇంకొందరు తమ రోజు వారీ పనికి ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సైతం స్మార్ట్ ఫోన్‌ వినియోగిస్తున్నారు. పెరిగిన స్మార్ట్ ఫోన్‌ వినియోగంతో చిన్నారులు కొందరు ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారి మానసిక వికలాంగులకు మారిపోతున్నారు. ఇటువంటి ఘటనలు ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నాం. అటువంటి ఘటన ఇపుడు రాజస్థాన్‌లో జరిగింది. 10 సంవత్సరాల బాలుడు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యాడు. మతి స్థిమితం కోల్పోయాడు.

Read also: Samantha :బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ల మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న సమంత అందాలు..

ప్రస్తుత కాలంలో ఏ ఇంట్లో చూసినా స్మార్ట్‌ఫోన్‌ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్‌ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది. వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్‌స్టాల్‌ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్‌ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్‌లో అల్వార్‌కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్‌లైన్‌ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. ఆ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్‌తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్‌లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్‌ ఫ్రీ అనే మొబైల్ గేమ్‌ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్‌జీ ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్‌ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు.

Read also: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తూ.. అతన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

Exit mobile version