Site icon NTV Telugu

Atrocious: ఇంత దారుణమా.. ఏడేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసి గొంతుకోసి హత్య

Uttarpradesh Crime

Uttarpradesh Crime

Atrocious: చిన్నపిల్లపై అఘ్యాయిత్యాలు ఆగడం లేదు. చాక్లెట్లు, బిక్కట్లు, చిప్స్ అంటూ ఆశ చూపించి వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడాలేకుండా మహిళలపై క్రూరమృగాళ్లా ప్రవర్తించి కామదాహాన్ని తీర్చుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ఇలాంటి దారుణ మైన ఘటన వెలుగు చూసింది. అభం శుభం తెలియని 7 ఏళ్ల చిన్నారిపై చిప్స్ ఆశ చూపించి అత్యాచారం చేసి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన యావత్ ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది.

కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్క్‌మన్ గేట్ నుండి 7 ఏళ్ల బాలిక తప్పిపోయిందని ఎస్పీ సిటీ అలీగఢ్ మృగాంక్ శేఖర్ పాఠక్ తెలిపారు. అతని తల్లిదండ్రులు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వెతికారు. విచారణలో ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఆ చిన్నారి పొరుగున నివసించే సుయాలీన్‌ ఇంట్లోకి ప్రవేశించినట్లు కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు వెంటనే సుయాలీన్‌ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా షాక్ కి గురయ్యారు. గోనె సంచిలో బాలిక మృతదేహం కనిపించడంతో సువాలిన్, అతని సోదరుడిని అరెస్టు చేశారు. అన్నదమ్ములిద్దరినీ విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. చిప్స్ ఇస్తానని ఆశ చూపి బాలికను ఇంట్లోకి తీసుకుని పోయామని తెలిపారు. ఆ తరువాత ఆ చిన్నారిపై అత్యాచారం చేశామని అన్నారు. అలాగే వదిలేస్తే ఆ చిన్నారి వారిద్దరిపేర్లు బయట వస్తాయని భయపడి తనని గొంతుకోసి హత్య చేశామని తెలిపారు. గోనె సంచిలో మృతదేహాన్ని వేసి ఎక్కడైన పడేసి చేతులు దులుపుకుందామని ప్లాన్ వేసారు. అయితే చిన్నారి నిందితుల ఇంట్లో వెళుతున్న వీడియో బయటకు రావడంతో అసలు భాగోతం బయటపడింది. దీంతో పోలీసులు సోదరులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Shiva Temple: దెయ్యాలు నిర్మించిన శివాలయం ఎక్కడ ఉందో తెలుసా?

Exit mobile version