డబ్బుపై ఆశ, కుటుంబానికి మంచి జరుగుతుందేమో అనే అత్యాశతో మూఢ నమ్మకాలు కొందరిని ఈజాఢ్యం వైపు నడిపిస్తూనే వుంది. అభివృద్ది జరుగుతున్న పలు ప్రాంతాల్లో ఈతరహా ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. వాటిని నమ్మవద్దని, వాటి ద్వారా దాడులకు పాల్పడవద్దని పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా మార్పు మాత్రం రావడం లేదు. ఎక్కడో ఒకచోట నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తూనే వున్నాయి. ఓ భర్త డబ్బుపై అత్యాశతో మంచిగా సంపాదించుకునే అవకాశం వస్తుందని తన భార్యను ఏకంగా అందిరి ముందు నగ్నంగా స్నానం చేయాలని ఆదేశించాడు.
ఈఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ వ్యక్తి వ్యాపారాలు చేస్తున్నాడు. అతనికి భార్య, కుటుంబం ఉంది. సాదాసీదాగా జరుగుతున్న వారి కుటుంబంలో.. కొన్ని రోజులుగా అతనికి వ్యాపారంలో ఆశించిన మేరకు పురోగతి లేదు. నిరాశతో వున్న అతను ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో కొందరు క్షుద్రపూజ చేయించాలని ఉచిత సలహా ఇచ్చారు. క్షుద్రపూజలు చేస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్మించారు. అంతేకాదు.. ఇంట సుఖసంతోషాలు.. ఆయురారోగ్యాలు వస్తాయని మాయమాటలు చెప్పడంతో.. వారి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ వ్యక్తి క్షుద్రపూజ చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఈనేపథ్యంలో.. భార్యను అందరిముందు నగ్నంగా స్నానం చేయాలని కోరాడు. భర్తమాటలకు ఒక్కసారిగా ఖంగుతింది భార్య. ఆపని చేయడానికి అస్సలు ఓప్పుకోలేదు. అయితే, ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశాడు, దీనికి అతని తల్లిదండ్రులు సైతం సహకరించడం గమనార్హం. ఏంచేయలేని పరిస్థితి, విధి లేక.. దిక్కుతోచని పరిస్థితిలో ఆమె వారు చెప్పినట్లే చేసింది. అక్కడ అందరూ చుట్టూ ఉన్నవారు కూడా ఈ దారుణాన్ని చూస్తూ ఉన్నారే తప్ప, ఎవరూ ఆదారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బతికున్నా చచ్చినదాంతో సమానంగా భావించింది ఆతల్లి.. ఆపనితో ఆమెలో సహనం చచ్చిపోయింది.
తెగించి బాధితురాలు వారినుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్తను ,అతని తల్లిదండ్రులనూ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి సలహా ఇచ్చిన మాంత్రికుడు పరారీలో ఉన్నాడని.. అతనిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. డబ్బుకోసం తన భార్యనే అందరి ముందు నగ్నంగా నిలచెట్టి స్నానం చేయించిన నీచుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
BJP MLA Raja Singh: ధర్మం కోసం చావడానికైనా సిద్ధం.. మళ్లీ వీడియో పెడతా.. రాజాసింగ్ సవాల్..!
