NTV Telugu Site icon

Heart Attack: కాలేజ్‌లో స్పీచ్ ఇస్తూనే.. గుండెపోటులో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని..

Maharashtra

Maharashtra

Heart Attack: ఇటీవల కాలంలో ఉన్నట్లుండి యువత గుండెపోటుకు గురవుతోంది. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వారు ఉన్నట్లుండి కుప్పకూలుతున్నారు. క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఓ కాలేజీ విద్యార్థిని స్పీచ్ ఇస్తూనే కుప్పకూలి ప్రాణాలు వదిలింది. 20 ఏళ్ల విద్యార్థిని వర్ష ఖరత్ ప్రసంగం మధ్యలో నవ్వుతూ కనిపించింది. ప్రసంగిస్తూనే, హార్ట్ ఎటాక్ రావడంతో మరణించింది.

Read Also: Sreeleela : దారుణం.. శ్రీలీలను అక్కడ పట్టుకుని లాగిన ఆకతాయిలు..

ఈ ఘటన ధరాశివ్ నగరంలో జరిగింది. ఒక కార్యక్రమంలో గుండెపోటు రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. పరాండ తాలూకాలోని మహర్షి గురువర్య ఆర్జీ షిండే మహావిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో వర్ష ఖరత్ మరాఠీలో ప్రసంగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రసంగానికి ప్రేక్షకులు నవ్వడం ప్రారంభించారు. ప్రసంగంలోనే ఆమె నెమ్మదిగా నేలపై కుప్పకూలింది. వెంటనే ప్రేక్షకులు ఆమెను వైద్యం కోసం తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.