Site icon NTV Telugu

Madhya Pradesh: నిబద్ధతకు హాట్స్ ఆఫ్.. 113 ఏళ్ల వయసులోనూ ఓటేసిన వృద్ధుడు

Untitled 4

Untitled 4

Madhya Pradesh: ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఇంకా చెప్పాలంటే ప్రజా స్వామ్య దేశం లో ఓటు అనేది ప్రజల ఆయుధం. కరెక్ట్ గా ఉపయోగించుకుంటే అవినీతిని అంతమొందించే శక్తి ఓటుకు ఉంది. అయితే ప్రస్తుతం ఉద్యోగాలని, ఉన్నత చదువులని మనలో చాలంది ఉన్న ఊరును వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్లి ఉంటారు. ఇక ఎన్నిలక సమయంలో ఒకరోజు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా మనలో చాల మంది ఆసక్తి చూపించరు. అయితే పది పదుల వయసు దాటిన తన బాధ్యతను నిర్వహించారు ఓ వృద్ధుడు. ఆయన నిబద్ధతకు అధికారులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఉన్న యువతకు ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా వయసును లెక్క చేయకుండా లేని ఓపికను తెచ్చుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు పెద్దాయన. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లో చోటు చేసుకుంది.

Read also:Rohit Sharma: అహ్మదాబాద్ పిచ్ ను పరిశీలించిన రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ

వివారాలలోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌ లో ఎన్నికలు జరిగిన సంగతి అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ లోని పాన్‌సెమల్‌ అసెంబ్లీ నియోజకవర్గ బూత్‌ నం.225లో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రానికి నానాజీ భిల్జీ అహిరా అనే వ్యక్తి కూడా వచ్చి ఓటేశారు. కాగా ఓటు వేసిన నానాజీ భిల్జీ అహిరా వయసు 113 సంవత్సరాలు. అయినా ఆయన తన వయసును లెక్క చేయకుండా తన ముని మనవడి మోటార్‌ సైకిలు వెనుక కూర్చొని ఉదయాన్నే పోలింగు కేంద్రానికి చేరుకొన్నారు. అనంతరం ఆయన ఓటు వేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంత వృద్దాప్యం లోనూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య రక్షణలో తన బాధ్యతను నిర్వహించిన ఆ వృద్ధుడి నిబద్ధతకు అధికారులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు వివిధ ఎన్నికల్లో కనీసం 100 సార్లు ఓటేసి ఉంటానని తెలిపారు.

Exit mobile version