NTV Telugu Site icon

RBI: ఆర్బీఐకి చేరిన 2వేల రూపాయల నోట్లు.. ఇంకా ఎంత చేరాలంటే..?

Untitled 7

Untitled 7

కొన్ని రోజుల క్రితం RBI రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో ప్రజలు తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు కొంతకాలం గడువు కూడా ఇచ్చింది. ఈ గడువు ముగిసే సమయానికి చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్లను దగ్గర లోని బ్యాంకులకు వెళ్లి మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు RBI తిరిగి వచ్చిన రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించిన విషయాలను వెల్లడించింది. వివరాలలోకి వెళ్తే.. దేశంలో చలామణిలో ఉన్న రెండు రూపాయల వేల నోట్లను RBI రద్దు చేసింది.

Read also:Nagarjuna Sagar: ఏపీ పోలీసులపై నమోదైన FIR కాపీలో అంశాలు ఇవే..

ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు RBI సెప్టెంబర్ 30 వరకు గడువిచ్చింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకు శాఖల్లో రద్దైన నోట్లను మార్చుకునే వెసులుబాటును కల్పించింది. కాగా నోట్ల మార్పిడి గడువును ఆ తరువాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐకి చెందిన 19 పంపిణీ కార్యాలయాల్లో రూ. నోటు మార్పిడి సౌకర్యం కల్పించింది RBI . అయితే నవంబర్ 30, 2023 ట్రేడింగ్ ముగిసే సమయానికి 97% నోట్లు తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే డీమోనిటైజేషన్ ప్రకటించినప్పుడు మార్కెట్‌లో రూ.3.56 లక్షల కోట్లు 2 వేల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి.

Read also:Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర.. భారత్‌కి సీఐఏ చీఫ్‌ని పంపిన బైడెన్..

అయితే ఆ నోట్లలో నవంబర్ 30, 2023 ట్రేడింగ్ ముగిసే సమయానికి 97% తోఇరిగి వచ్చాయని.. ఇంకా 9,760 తిరిగి రావాల్సి ఉన్నట్లు పేర్కొంది. కాగా ఇప్పటికీ RBI తన ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2,000 నోట్లను మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది. కాగా ఈ నోట్లను మార్చుకోవడానికి పాన్, ఆధార్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాలు అవసరం అవుతాయి. అయితే గడువును తేదీని ఇంకా పేర్కొనలేదు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Show comments