Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో 9 విమానాలు ధ్వంసం! ఆధారాలివే!

Operationsindoor

Operationsindoor

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్‌.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం కాగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన 9 విమానాలు ధ్వంసం అయినట్లుగా సమాచారం అందుతోంది. వైమానిక స్థావరాలతో పాటు సైనిక ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇది కూడా చదవండి: Spying: జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్

పాకిస్థాన్ వైమానికి దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు, రెండు ఖరీదైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ -130 పెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నాలుగు రోజుల పాటు సాగిన ఆపరేషన్ సిందూర్‌లో అధిక విలువ కలిగిన రెండు ఎయిర్‌బోర్న్ విమానాలు నాశనం అయినట్లు సమాచారం. ఇక పాకిస్థాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్వీడిష్ మూలానికి చెందిన మరో ఏఈడబ్లయూసీ విమానం.. ఉపరితల క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైందని తెలుస్తోంది. ఇది పూర్తిగా ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా అర్థమవుతోంది.

ఇది కూడా చదవండి: Good Wife : ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..

ఇక పాకిస్థాన్ పంజాబ్‌పై లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ దాడిలో పీఏఎఫ్ సీ-130 హెర్క్యులస్ విమానం ధ్వంసమైనట్లు ప్రత్యేక ఆపరేషన్‌లో తేలింది. ఈ C-130 విమానం లాజిస్టికల్ సపోర్ట్ కోసం ఉపయోగించబడుతుంది. డ్రోన్ దాడి జరిగినప్పుడు ముల్తాన్ సమీపంలోని ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గర నిలిపి ఉంచారని వర్గాలు తెలిపాయి.

పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదలు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.

Exit mobile version