Site icon NTV Telugu

Apple Watch : యువకుడి ప్రాణం కాపాడిన ఆపిల్ వాచ్

Apple Watch

Apple Watch

Apple Watch : సాధారణంగా స్మార్ట్‌వాచ్‌లను మనం కేవలం గాడ్జెట్‌లుగానే చూస్తాం. కానీ అదే గాడ్జెట్ ఒక యువకుడి ప్రాణాలను కాపాడితే? అవును, మధ్యప్రదేశ్, నైన్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త సాహిల్ విషయంలో ఇదే జరిగింది.. రైలు ఎక్కడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు… ఆయన ఆపిల్ వాచ్ ఇచ్చిన ఒకే ఒక్క అలర్ట్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. హై హార్ట్ రేట్ హెచ్చరికను గమనించి అతను ఆసుపత్రికి వెళ్లడం వల్లే.. బ్రెయిన్ హేమరేజ్ లాంటి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు.

సాహిల్ అనే ఈ యువకుడు.. రైస్ మ్యానుఫ్యాక్చరర్..! ఆ రోజు అతనికి జబల్‌పూర్‌లో మీటింగ్ ఉంది. ఆ రోజు తన డే రొటీన్‌గానే సాగింది.. మీటింగ్ అయిన తరువాత… కొంచెం రిలాక్స్ అవ్వాలని సినిమాకు వెళ్లారు.. ట్విస్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది.. సాయంత్రం 5 గంటల టైమ్‌లో… సాహిల్ ఏసీ థియేటర్‌లో నిశ్శబ్దంగా కూర్చున్నారు.. ఆయన ఆపిల్ వాచ్ సిరీస్ 9 సడెన్‌గా వైబ్రేట్ అయ్యింది.. “మీరు ఇన్యాక్టివ్‌గా ఉన్నప్పటికీ… గత 10 నుంచి 15 నిమిషాలుగా మీ హార్ట్ రేట్ 150 BPM దాటిపోయింది” అని అలర్ట్ ఇచ్చింది.

ఆయన కూర్చుని ఉన్నారు.. ఫిజికల్ యాక్టివిటీ లేదు.. అయినా హార్ట్ రేట్ అంత హైగా ఉంది.. వెంటనే ఆయనకు టెన్షన్ మొదలైంది..! 7:30కి రైలు టికెట్ ఉన్నా… ట్రైన్ క్యాన్సిల్ చేసుకుని హాస్పిటల్‌కు వెళ్లారు.. బ్లడ్ ప్రెషర్ డేంజరస్‌గా 180/120గా ఉందని డాక్టర్స్ క్లారిటీగా చెప్పారు: “ఒకవేళ మీరు ఆ ట్రైన్ ఎక్కి ఉంటే.. బ్రెయిన్ హేమరేజ్ లేదా స్ట్రోక్‌తో కూలిపోయేవారు.. అని చెప్పారు.

సాహిల్ ప్రాణం నిలబెట్టింది ఆ ఒక్క అలర్ట్..! వర్క్ స్ట్రెస్, జంక్ ఫుడ్, నిద్ర లేమి కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. సాహిల్ తను సేఫ్ అయినందుకు.. ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌కు థ్యాంక్స్ చెప్తూ ఈమెయిల్ కూడా పంపారు.. ఆశ్చర్యకరంగా… టిమ్ కుక్ పర్సనల్‌గా రిప్లై ఇచ్చారు..

తన ఫ్యామిలీలో గుండె సమస్యల హిస్టరీ ఉంది..! అందుకే అందరూ స్మార్ట్‌వాచ్ వాడాలని, ముఖ్యంగా ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ఈ మూడూ చాలా అవసరమని చెబుతున్నారు.. ఒక గాడ్జెట్ నిజంగా లైఫ్ సేవర్ అయింది!

Groww Success Story: ఓ రైతు కొడుకు రూ.70 వేల కోట్ల కంపెనీకి అధిపతి అయ్యాడు..!

Exit mobile version