ఇండియాలో కరోనా టెర్రర్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,318 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,45,63,749 కి చేరగా ఇందులో 3,39,88,797 మంది ఇప్పటికే కోలుకున్నారు. 1,07,019 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 465 మంది మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,67,933 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంటల్లో 73,58,017 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 1,21,06,58,262 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.