NTV Telugu Site icon

Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. స్కూల్‌లోనే కుప్పకూలిన చిన్నారి..

New

New

Heart Attack: ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికి వస్తుందని అనుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం ఆందోళనలు పెంచుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో యుక్త వయస్కులు గుండెపోటుకు గురై మరణించారనే వార్తలు వింటూనే ఉన్నాం. చివరకు స్కూల్ పిల్లలు మరణించడం సమస్య తీవ్రతను పెంచుతోంది.

Read Also: Sankranti Special Buses: సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్..

కర్ణాటక చామరాజనగర‌‌లో 8 ఏళ్ల 3వ తరగతి చదువుతున్న బాలిక గుండె పోటుతో మరణించింది. ఫ్రాన్సిస్ స్కూల్‌లో చదువుతున్న చిన్నారి తేజస్విని, టీచర్‌కి నోట్ బుక్ చూపిస్తూనే కుప్పకూలింది. వెంటనే ఆమెని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించడా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

గత నెలలో, ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలోని తన పాఠశాలలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ సమయంలో 4 ఏళ్ల బాలుడు గుండెపోటుతో విషాదకరంగా మరణించాడు. సెప్టెంబరులో, ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో 9 ఏళ్ల బాలిక పాఠశాలలో గుండెపోటుతో విషాదకరంగా మరణించింది. ఆమె ప్లేగ్రౌండ్‌లో ఆడుకుంటూ కుప్పకూలిపోయిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. లైఫ్ స్టైల్, పొల్యూషన్, స్టెరాయిడ్ల వాడకంతో అసే అనేకా కారణాలు గుండె వ్యాధులకు దారితీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Show comments