NTV Telugu Site icon

XBB 1.16 variant: భయపెడుతోన్న కొత్త వేరియంట్‌.. ఫోర్త్‌ వేవ్‌ తప్పదా..?

Covid

Covid

XBB 1.16 variant: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలతో పాటు భారత్‌తోనూ భయానక పరిస్థితులను చూపించింది.. వైరస్‌ బారిన పడితే చాలు.. అయినవారు కూడా ఆదరించని పరిస్థితులను చూపించింది.. కడసారి చూపుకు కూడా నోచుకోని స్థితికి తీసుకెళ్లింది.. ఇప్పటికే భారత్‌లో ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌, థర్డ్‌ వేవ్‌ రూపంలో కోట్లాది మందిపై ఎటాక్‌ చేసింది.. లక్షలాది మంది ప్రాణాలు తీసింది.. ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ 19 కొత్త వేరియంట్‌ ఎక్స్‌బీబీ.1.16 వైరస్‌ను 76 నమూనాల్లో గుర్తించినట్లు ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 జెనోమిక్స్‌ కన్సార్టియం పేర్కొంది.. ఈ మధ్య క్రమంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావొచ్చని అంటుంది..

Read Also: Rain Alert : తెలుగు రాష్ట్రాలకు అలర్ట్‌.. మరో రెండ్రోజులు వర్షాలు

కాగా, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ భారతదేశంలో జనవరి నెలలో 2 శాంపిళ్లలో వెలుగు చూసింది.. ఫిబ్రవరిలో 59కి చేరుకుంది.. మార్చిలో 15 శాంపిళ్లలో బయటపడినట్టు ఇన్సాకాగ్‌ తెలిపింది.. ఇప్పుడు 76 శాంపిల్స్‌లో కొత్త వేరియంట్‌ బయటపడింది.. వీటిలో కర్ణాటకలో 30, మహారాష్ట్రలో 29, పాండిచ్చేరిలో 7, ఢిల్లీలో 5, తెలంగాణలో 2, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్, ఒడిశాల్లో ఒక్కో కేసు నమోదు అయ్యాయి.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లకు సన్నద్ధం కావాలని సూచించింది.. అయితే, మరోసారి కొత్త వేరియంట్‌ రూపంలో కరోనా విరుచుకుపడనుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌ 12 దేశాల్లో బయటపడినప్పటికీ అమెరికా, బ్రూనై, సింగపూర్, యూకేల కంటే భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదైనట్లు ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ అండ్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషియన్‌ మాజీ కన్వీనర్‌ విపిన్‌ ఎం. వశిష్ట వెల్లడించారు.. ఈ వేరియంట్‌ మూంగా దేశంలో గత రెండు వారాల్లోనే 281 శాతం పాజిటివ్‌ కేసులు పెరిగాయని.. 17 శాతం మరణాలు సంభవించాయని పేర్కొన్నారు..

Read Also: Visakhapatnam Crime: పోలీస్ స్టేషన్ కు చేరిన ఫేస్ బుక్‌ పరిచయం..! ఏం జరిగిందంటే?

ఇక, దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 800 పైగా కరోనా కేసులు వెలుగు చూశాయి.. 126 రోజుల తర్వాత ఇదే అత్యధికం కావడం ఆందోళన కలిగించే అంశం.. కోవిడ్-19 కేసుల్లో ఇటీవలి పెరుగుదల ఈ వేరియంట్‌కు కారణమని కొందరు నిపుణులు పేర్కొన్నారు. జాతీయ కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌కు నాయకత్వం వహించిన మాజీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, కోవిడ్ కేసుల పెరుగుదల XBB 1.16 వేరియంట్‌తో మళ్లీ విస్తరిస్తోన్నట్టు అనిపిస్తోంది, అయితే ఇన్ఫ్లుఎంజా కేసులు H3N2 కారణంగా కూడా ఉన్నాయన్నారు. “ఈ రెండింటికీ, కోవిడ్‌కు తగిన ప్రవర్తనను అనుసరించడం వలన ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే చాలా కేసులు తీవ్రంగా లేవు, కాబట్టి ఇప్పటికిప్పుడు భయపడాల్సిన అవసరం లేదు” అని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ చైర్మన్, రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్, డైరెక్టర్-మెడికల్ ఎడ్యుకేషన్ మెదంతా మరియు మాజీ ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పారు. దీంతో.. మరోసారి కరోనా విరుచుకుపడుతుందా? ఫోర్త్‌ వేవ్‌ తప్పదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Show comments