Site icon NTV Telugu

RBI: రూ.2000 నోట్లలో.. 76 శాతం బ్యాంకులకు చేరాయి..!

Rbi

Rbi

RBI: రూ.2000 నోట్ల (Rs 2000 notes)ను ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకున్న ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడంతో ఆ నోట్లన్నీ బ్యాంకులకు చేరుకుంటున్నాయి. తాజా లెక్కల ప్రకారం.. మే 19 నుంచి 76 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరాయని. కాగా 87 శాతం నోట్లను మార్చారని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది. ఇందులో అత్యధిక శాతం డిపాజిట్ల రూపంలో వచ్చినవే అని పేర్కొంది.

CM YS Jagan: ఈ పథకాలు పొందాలంటే తప్పనిసరిగా టెన్త్‌ చదవాలి.. సీఎం కీలక వ్యాఖ్యలు

‘‘బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. మే 19 తర్వాత నుంచి జూన్‌ 30వ తేదీ వరకు రూ.2.76లక్షల కోట్ల విలువైన రూ.2వేల నోట్లు (Rs 2000 notes) మళ్లీ బ్యాంకులకు చేరుకున్నాయి. మొత్తం చలామణీలో ఉన్న నోట్లలో ఇది 76శాతం. ఇక, రూ. 84 వేల కోట్ల విలువైన నోట్లు మాత్రమే చలామణీలో ఉన్నాయి’’ అని ఆర్‌బీఐ (RBI) ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా.. బ్యాంకులకు చేరుకున్న రూ.2వేల నోట్లలో దాదాపు 87 శాతం డిపాజిట్ల రూపంలోనే వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్ తెలిపింది. మిగతా 13 శాతం నోట్లను ప్రజలు మార్చుకున్నట్లు పేర్కొంది. మరోవైపు చివరి నిమిషం వరకు వేచి ఉండవద్దని ఆర్‌బీఐ ప్రజలకు నిరంతరం విజ్ఞప్తి చేస్తోంది.

Potato Fingers : పొటాటో ఫింగర్స్ ను ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?

మార్కెట్‌లో చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మే 19న ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు విధించింది. 2016లో రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత రూ.2వేల నోట్లను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Exit mobile version