PM Modi: ప్రధాని మోడీకి తిరుగులేని ఆమోదం.. 75 శాతం “అప్రూవల్ రేటింగ్” ఉన్నట్లు తాజా సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి దేశ ప్రజల్లో తిరుగులేని ఆమోదం ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. Ipsos IndiaBus పీఎం అప్రూవల్ రేటింగ్ సర్వేలో పీఎం మోడీకి దేశవ్యాప్తంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉన్నట్లు సర్వే తెలిపింది. ఈ సర్వే ఫిబ్రవరి 2024లో జరిగింది. గతేడాది సెప్టెంబర్ నెల సర్వేతో పోలిస్తే ఆమోదం 65 శాతం నుంచి 10 శాతం పెరిగి 75 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. కొన్ని నగరాల్లో మోడీ పనితీరుకు ఎక్కువ రేటింగ్ ఇచ్చారు. మొత్తం నాలుగు జోన్ల వారీగా సర్వే జరిగింది. నార్త్ జోన్‌లో 92 శాతం, ఈస్ట్ జోన్‌లో 84 శాతం, వెస్ట్ జోన్‌లో 80 శాతం ఆమోదం ఉంది. అయితే సౌత్ జోన్‌లో అత్యల్పంగా 35 శాతం రేటింగ్ లభించింది.
టైర్-1, టైర్-3 నగరాల్లో 84, 80 శాతం ఆమోదం లభించింది. 45 ఏళ్లకు పైబడిన వారిలో 79 శాతం, 18-30 ఏళ్లు 75 శాతం రేటింగ్ ఇచ్చారు. సర్వేలో మెట్రో నగరాల్లో 64 శాతం, టైర్-2 నగరాల్లో 62 శాతం రేటింగ్ ఇచ్చారు. స్వయం ఉపాధి పొందేవారు 59 శాతం అప్రూవల్ రేటింగ్ ఇచ్చారు. సర్వే ప్రకారం, ప్రధాని మోడీ ప్రభుత్వం విద్య, పారిశుద్ధ్యం మరియు పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో బాగా పనిచేసిందని చెప్పారు.
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- RSS: ఆర్ఎస్ఎస్, హిజ్బుల్ ముజాహిదీన్ ఒకటే.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
Read Also: Himanta Biswa Sarma: రాహుల్ గాంధీ ప్రేమ నాకొద్దు.. లాలూ హిందూ నిర్వచనాన్ని మరిచిపోయాడు..
అయోధ్యలో రామ మందిర నిర్మాణం నార్త్ జోన్‌లో రేటింగ్‌ని ప్రభావితం చేసిందని సర్వే సంస్థ అధికారి పారిజాత్ చక్రవర్తి అన్నారు. యూఏఈలో దేవాలయం, ఏ పాశ్చాత్య దేశ ప్రభావంతో సంబంధం లేదకుండా ప్రపంచ సమస్యలపై ఒక వైఖరి తీసుకోవడం, అంతరిక్ష ప్రయోగాలు, జీ-20 సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం, మేక్ ఇన్ ఇండియాకు పెద్ద పీట వేయడం వంటివి ప్రధాని మోడీ అప్రూవల్ రేటింగ్ పెరిగేందుకు సహకరించాయి.
వివిధ రంగాల్లో ప్రభుత్వ పనితీరు రేటింగ్ ఎలా ఉంది..?
1) విద్యా వ్యవస్థ 76%
2) పారిశుధ్యం మరియు పరిశుభ్రత 67%
3) ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 64%
4) కాలుష్యం మరియు పర్యావరణం 56%
5) పేదరికం 45%
6) ద్రవ్యోల్బణం 44%
7) నిరుద్యోగం 43%
8) అవినీతి 42%
తాజావార్తలు
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!