NTV Telugu Site icon

Rs. 2000 note withdrawal: బ్యాంకులకు చేరిన 72 శాతం రూ.2000 నోట్లు..

Rs. 2000 Note Withdrawal

Rs. 2000 Note Withdrawal

Rs. 2000 note withdrawal: మే 19న భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూ. 2000 నోట్లను ఉపసంహరించుకుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు గడువు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు 72 శాతం రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ప్రజలు నోట్లను మార్చుకోవడమో లేకపోతే ఖాతాల్లో డిపాజిట్ చేయడమో చేశారని వెల్లడించింది.

Read Also: Rain Effect: తెలంగాణకు రెయిన్ ఎఫెక్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

72 శాతం అంటే వీటి విలువ రూ. 2.62 లక్షల కోట్లుగా ఉంది. రూ. 2000 నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు, రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవడానికి, ఏ బ్రాంచ్‌లోనైనా ఒకేసారి రూ. 20,000 పరిమితి వరకు మార్చుకోవచ్చని కూడా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

ఆర్బీఐ గత నెలలో విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం… రిజర్వ్ బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీని అనుసరించి రూ.2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంది. రూ. 2000 నోట్లలో 89 శాతం మార్చి 2017 పెద్ద నోట్ల రద్దు అనంతరం జారీ చేయబడినవే. వాటి జీవిత కాలం 4 నుంచి 5 ఏళ్లు ఉంటుందని ఆర్బీఐ నోటిషికేషన్ లో తెలిపింది. బ్యాంకులు కూడా నోట్ల ఉపసంహరణకు ప్రత్యేక ఏర్పాట్లను చేశాయి.

Show comments