700 Pigs Culled In Madhya Pradesh Amid African Swine Flu Scare: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ భయాందోళనలను రేపుతోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. దమోహ్ జిల్లాలో ఈ వ్యాధి వెలుగులోకి రావడంతో అధికారులు పందులను చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 700 పందులను చంపినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గత పదిహేను రోజులుగా వరసగా జంతువులు చనిపోతున్నాయి. జిల్లాలోని హటా బ్లాక్ ఓ జంతువు హఠాత్తుగా మరణించింది. ఆ తరువాత వరసగా జిల్లాలోని బనావర్ ప్రాంతంలో ఆవులు, ఎద్దులు, పందులలతో సహా వందలాది జంతువులు వారం రోజుల వ్యవధిలో చనిపోయాయి.
Read Also: Air India: మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తి కోసం పోలీసుల గాలింపు..
ఈ ఘటనపై విచారించిన వెటర్నరీ డాక్టర్లు.. జంతువులకు స్వైన్ ఫ్లూ సోకినట్లు నిర్థారించారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సోమిల్ రాయ్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం సూచన మేరకు అనారోగ్యంతో ఉన్న పందుల నమూనాలను సేకరించి విశ్లేషించామని జిల్లాలోని హటా, బనావర్ ప్రాంతంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించామని, ఫలితంగా ఆ ప్రాంతంలో వ్యాధి వ్యాపించిందని.. దీంతో పందునలు చంపుతున్నట్లు వెల్లడించారు. పందులను చంపేసి జేసీబీల సాయంతో పూడ్చివేస్తున్నారు. గత రెండు రోజుల్లో 700 కన్నా ఎక్కువ పందును చంపి పాతిపెట్టారు. దమోహ్ జిల్లా కలెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాధి సోకిన ప్రాంతాల్లో పందులను చంపేస్తున్నామని.. ఎవరైనా పందుల కాపరిలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
