Site icon NTV Telugu

పాక్ మ్యాచ్ గెలిచాక సంబరాలు.. ఏడుగురిపై కేసు, నలుగురి అరెస్ట్‌.

టీ 20 వరల్డ్‌ కప్‌లో ప్రతీ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతున్నాయి.. ఇక, భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే హై ఓల్టేజ్‌.. ఆ మ్యాచ్‌లో భారత్‌తో ఓటమిని సగటు భారతీయుడు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడు.. మరోవైపు.. భారత్‌లో కొందరు సంబరాలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై సీరియస్‌ అయ్యింది ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ సర్కార్.. ఆగ్రా, బరేలీ, బదాయూ, సీతాపూర్‌లో ఈ లాంటి చర్యలకు పూనుకున్నవారిపై కేసులు నమోదు చేశారు యూపీ పోలీసులు.. మొత్తం ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.. నలుగురిని అరెస్ట్‌ చేసినట్టుగా సీఎంవో ప్రకటించింది. బాణాసంచా కాల్చడమే కాదు.. వీరు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్టుగా అభియోగాలు మోపారు పోలీసులు. ఇక, పాక్‌కు మద్దతుగా సంబరాలు చేసుకున్న మరికొంత మంది వివరాలను కూడా సేకరించే పనిలో పడిపోయింది. ఇంకా కొందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

Exit mobile version