Indian students: ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం లాంటి.. పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేక మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో ఇప్పటి వరకు 633 మంది విద్యార్థులు విదేశాల్లో మరణించినట్లుగా కేంద్ర సర్కార్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభకు సమర్పించిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
Read Also: Telangana Assembly 2024 LIVE UPDATES: తెలంగాణ అసెంబ్లీ 2024.. లైవ్ అప్‌డేట్స్
కాగా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఐదేళ్లలో మొత్తం 633 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపగా.. అందులో అత్యధికంగా కెనడాలో 172 మంది మరణించగా.. ఆ తర్వాత యూకేలో 58, ఆస్ట్రేలియాలో 57, రష్యాలో 37, జర్మనీలో 24, పాకిస్థాన్‌లో ఒకరు చొప్పున విద్యార్థులు విడిచారు. ఇటీవల విదేశాల్లో ఇండియన్ స్టూడెంట్స్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీయుల దాడిలో కెనడాలో 9 మంది, యూఎస్‌లో 6, ఆస్ట్రేలియా, చైనా, యూకేలో ఒక్కొక్కరు చొప్పున 19 మంది మరణించినట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్థన్ సింగ్ వెల్లడించారు.
Read Also: Deadpool & Wolverine Review: డెడ్ పూల్ వాల్వరిన్ రివ్యూ.. కుర్చీ మడత పెట్టాడా? లేదా?
విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడి భారత రాయబరి కార్యాలయాలు వెంటనే రియాక్ట్ అయి.. తగిన చర్యలు తీసుకుని.. నేరస్థులకు శిక్ష పడేలా చూస్తాయని కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్థన్ చెప్పారు. ఇటీవల చేపట్టిన వందే భారత్ మిషన్, ఆపరేషన్ గంగా (ఉక్రెయిన్), ఆపరేషన్ అజయ్ (ఇజ్రాయెల్) ద్వారా ప్రపంచదేశాల్లో ఇబ్బంది పడుతున్న ఇండియన్ స్టూడెంట్స్ ను స్వదేశానికి తీసుకొచ్చామన్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు MADAD పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకుంటే వారి సమస్యలపై మన ఏజెన్సీలు వెంటనే స్పందించే ఛాన్స్ ఉందన్నారు.
