Site icon NTV Telugu

Chhattisgarh: దగ్గర పడుతున్న డెడ్‌లైన్.. 63 మంది మావోలు లొంగుబాటు

Naxalites Surrender

Naxalites Surrender

మావోయిస్టులకు కేంద్రం విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. మార్చి, 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో గతేడాది నుంచి దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. గత సంవత్సరం అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆ పరంపర కొత్త ఏడాదిలో కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Silver Rates: మరోసారి సిల్వర్ హడల్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో 36 మందిపై మొత్తం రూ. 1.19 కోట్ల బహుమతి ఉందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఏడుగురిలో ఒక్కొక్కరికి రూ. 8 లక్షల రివార్డు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం పునరావాస విధానంతో ఆదుకుంటామన్నారు. వీరంతా రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ డివిజన్, పశ్చిమ బస్తర్ డివిజన్, మాడ్ డివిజన్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నారని చెప్పారు. 18 మంది మహిళలు సహా 63 మంది మావోలు.. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల ముందు లొంగిపోయారని దంతెవాడ పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ వెల్లడించారు. 2025లో రాష్ట్రంలో 1,500 మందికి పైగా మావోలు లొంగిపోయారని పోలీసులు చెప్పారు.

ఈ పరిణామాన్ని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ప్రశంసించారు. బస్తర్ ప్రాంతంలో శాంతి, విశ్వాసం, అభివృద్ధి దిశగా మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించారని కొనియాడారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Trump: జేడీ వాన్స్, మార్కో రూబియో పిల్లలకు ట్రంప్ బహుమతులు.. ఏమిచ్చారంటే..!

Exit mobile version