Site icon NTV Telugu

Digital IDs: 61 మిలియన్ రైతులకు డిజిటల్ ఐడీలు.. కేంద్రం లక్ష్యం ఇదే!

Digitalids

Digitalids

భారతదేశం అగ్రికల్చర్‌కు ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. ఇండియాలో పండే పంటలు ఏ దేశంలోనూ పండవు. భారతీయ రైతులు వ్యవసాయానికి పెద్ద పీట వేస్తుంటారు. ఇక రైతుల ఉత్సాహానికి ప్రభుత్వాలు కూడా సహాయ సహకారాలు అందిస్తుంటాయి. కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తుంటే.. కొన్ని రాష్ట్రాలు ఉచిత విద్యుత్‌తో పాటు పెట్టుబడి సాయాలు అందిస్తుంటాయి.

ఇది కూడా చదవండి: ISRO Recruitment 2025: B.Tech పాసైతే చాలు.. ఇస్రోలో 320 ఇంజనీర్ జాబ్స్ రెడీ..

అయితే కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశంలో కర్షకులకు ఆధార్ కార్డు తరహాలో డిజిటల్ ఐడీ కార్డులను జారీ చేసింది. దాదాపు దేశంలో 14 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 6.1 కోట్లకు పైగా రైతులకు ఈ డిజిటల్ ఐడీలను జారీ చేసింది. ఇందులో రైతుల భూ రికార్డులకు అనుసంధానించబడి ఉంటాయి. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌లో భాగంగా అగ్రి స్టాక్ కింద ఈ డిజిటల్ ఐడీలు ఇస్తున్నారు. భూమి రికార్డులు, పశువుల యాజమాన్యం, నాటిన పంటలు, పొందిన ప్రయోజనాలతో సహా వివిధ రైతు సంబంధిత డేటాకు ఇవి అనుసంధానించబడి ఉంటాయి. ఈ కార్డు క్రెడిట్, పంట బీమా, పీఎం కిసాన్ చెల్లింపులను వేగవంతం చేయడానికి సహాయపడనుంది.

ఇది కూడా చదవండి: India: ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1.46 ట్రిలియన్లకు చేరుకున్న రక్షణ ఉత్పత్తి..

ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 6.1 కోట్ల మందికి డిజిటల్ ఐడీలను భూమి రికార్డులతో అనుసంధించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2027 నాటికి 110 మిలియన్ల రైతులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భూమి రికార్డులు, పంటల వివరాలతో ఇది అనుసంధానించబడుతుందని చెప్పారు. ఈ కార్డుతో క్రెడిట్, పంట బీమా, పీఎం కిసాన్ చెల్లింపులను వేగవంతం చేయడానికి సహాయపడనుందని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోందని వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ (13 మిలియన్లు), మహారాష్ట్ర (9.9 మిలియన్లు), మధ్యప్రదేశ్ (8.3 మిలియన్లు), ఆంధ్రప్రదేశ్ (4.5 మిలియన్లు), గుజరాత్ (4.4 మిలియన్లు), రాజస్థాన్ (7.5 మిలియన్లు), తమిళనాడు (3 మిలియన్లు) రాష్ట్రాల్లో డిజిటల్ కార్డులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఐడీలను అందించడంలో పురోగతి సాధించాయని తెలిపారు.

Exit mobile version