NTV Telugu Site icon

Earthquake: మార్చి నెలలో 6 భూకంపాలు.. ఉత్తరాదిని వణికిస్తున్న ప్రకంపనలు..

Earthquake In India

Earthquake In India

Earthquake: వరస భూకంపాలతో ఉత్తర భారతదేశం వణుకుతోంది. ఒక్క మార్చి నెలలోనే రిక్టర్ స్కేల్ పై 4 తీవ్రతతో 6 భూకంపాలు వచ్చాయి. ఫిబ్రవరి నుంచి లేక్కేస్తే 10 భూకంపాలు వచ్చాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భూకంపం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వణికించింది. తాజా భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ లని హిందూకుష్ ప్రాంతంలో నమోదు అయింది. ఆఫ్ఘనిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్, భారత్ లో దీని ప్రకంపనలు కనిపించాయి.

Read Also: Illegal Relationship : తల్లి ప్రియుడిని చంపిన కొడుకు.. జార్ఖండ్‌లో ఘోరం

అసలెందుకు భూకంపాలు వస్తున్నాయి:

శాస్త్రవేత్తల ప్రకారం పశ్చిమ హిమాలయాలు అంటే ఆఫ్ఘనిస్తాన్ లోని హిందూ కుష్ పర్వతాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న హిమాలయ ప్రాంతం ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. అయితే ప్రాంతంలో భూ అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా అవుతున్నాయి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం భారత ఉపఖండం టెక్టానిక్ ప్లేట్ యూరేసియా టెక్టానిక్ ప్లేట్ ను ఢీకొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియ నిరంతం జరుగుతుంటుంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరంగా కదులుతూ యూరేసియా టెక్టానిక్ ప్లేట్ ను ముందుకు నెట్టుతోంది.

ఈ ప్రక్రియలో విడుదలైన శక్తి భూకంపాల రూపంలో కనిపిస్తోంది. ఓ అంచనా ప్రకారం ఎప్పుడో రోజు 8 తీవ్రతతో ఈ ప్రాంతంలో భారీ భూకంపం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మనదేశంలో భూకంపం వచ్చే ప్రాంతాలను 4 ప్రాంతాలుగా విభజించారు.

జోన్ 1 తక్కువ-తీవ్రత వర్గం కిందకు వస్తుంది మరియు ఇది కర్ణాటక పీఠభూమి వెంబడి ఉంది.

జోన్ 2 కేరళ, గోవా మరియు లక్షద్వీప్ దీవులతో పాటు పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా మరియు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు భూకంపం వచ్చే అవకాశం.

జోన్ 3 అధిక తీవ్రతతో కూడిన భూకంపాలకు సంబంధించినది. ఇది జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ-ఎన్‌సిఆర్, సిక్కిం, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ యొక్క ఉత్తర ప్రాంతాలు, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ యొక్క పశ్చిమ తీరాన్ని కలిగి ఉంది.

జోన్ 4 ఉత్తర బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ మరియు అండమాన్ మరియు నికోబార్ దీవులను కవర్ చేసే అత్యంత తీవ్రమైన భూకంపాలకు సంబంధించినది.