Site icon NTV Telugu

Maharashtra rain: ముంచెత్తిన వరదలు.. 6కు చేరిన మృతుల సంఖ్య

Mumbairain

Mumbairain

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే బుధవారం ముంబై, పూణెలాంటి నగరాలను భారీ వరద ముంచెత్తింది. ఇళ్లు, దేవాలయాలు, కార్లు మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై అధికారులను అలర్ట్ చేసింది.

నీటి మునిగిన ప్రాంతాల్లో ప్రజలను సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరదలు కారణంగా ఇప్పటివరకు ఆరుగురు చనిపోయారు. విద్యుత్ షాక్‌తో నలుగురు, డ్యామ్‌లో పడి ఇద్దరు మరణించారు. మరోవైపు ముంబైలో భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Operation Raavan: సినిమాలకు ఇండస్ట్రీలోనే ఇబ్బందులున్నాయి.. డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక భారీ వర్షం కారణంగా విమానాశ్రయంలోని విమాన సేవలు దెబ్బతిన్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. విమాన షెడ్యూల్‌ కాలానుగుణంగా ఆలస్యం అవుతాయని విమాన సంస్థలు తెలిపాయి. ఇక ఎయిర్ ఇండియా రద్దు చేసిన విమానాలకు పూర్తి వాపసును అందించింది.

ఇది కూడా చదవండి: Darshan: యాక్టర్ దర్శన్‌కి కోర్టులో చుక్కెదురు.. అందుకు నో చెప్పిన కోర్టు..

Exit mobile version