NTV Telugu Site icon

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

Fire Accident

Fire Accident

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వివరాల ప్రకారం.. కథువాలోని ఓ ఇంట్లో ఈ రోజు (డిసెంబర్ 18) తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అయితే, మంటల్లో చిక్కుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదం కారణంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు సమాచారం.

Read Also: Neha Shetty : OG లో రాధికా స్పెషల్ సాంగ్.. యూత్ కి జాగారమే

అయితే, మంటలు చెలరేగాయన్న స‌మాచారంతో హుటాహుటిన సంఘ‌ట‌న ప్రాంతానికి ఆగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. బాధితుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌పై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామ‌ని పోలీసులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ స‌ర్క్యూటే కార‌ణమై ఉంటుంద‌ని పోలీసుల ప్రాథమిక స‌మాచారంలో తేలింది.