Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలి ఎన్నికల సాధ్యంపై మోడీ సర్కార్ ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న సొంత బలం ఏమాత్రం సరిపోదు. జమిలి ఎన్నికల కోసం అదనపు ఎంపీల సపోర్టు కూడగట్టాల్సి ఉంది.
Read Also: CM Chandrababu: ఇంటింటికీ కుళాయి నీరు.. నేడు సీఎం కీలక సమీక్ష..
కాగా, జమిలి అంటే పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 1951 నుంచి 1967 వరకు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు కొనసాగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పడిపోవడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చి జమిలి మాయమై ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటన్నింటినీ రానున్న సార్వత్రిక ఎన్నికలతో చేర్చాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువును పెంచడంతో పాటు మరికొన్నింటిని తగ్గించాల్సి ఉంటుంది. లోక్‌సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు అన్నమాట. ఇందుకు రాజ్యాంగ పరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా, దేశంలో వివిధ ఎన్నికల నిర్వహణ తీరు తెన్నులు, మార్గదర్శకాలకు సంబంధించి 1951 ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు పలు కీలక రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
Read Also: Himachal : మసీదు వివాదం.. సిమ్లాలో 90 శాతం హోటళ్లు ఖాళీ, వ్యాపారులు ఆందోళన
* ప్రధానంగా 6 రాజ్యాంగ సవరణలు చేయాలి..
* లోక్‌సభ, రాజ్యసభల కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83 సవరణ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్ల గడువును నిర్దేశించే ఆర్టికల్ 172(1)ని సవరించడం.
* అత్తయిక పరిస్థితుల సమయంలో సభా కాల పరిమితిని ఏడాదికి మించకుండా పార్లమెంటు చట్టం ద్వారా వీలు కల్పించే ఆర్టికల్ 83(2)ని సవరణ చేయడం.
* రాష్ట్రపతికి లోక్‌సభను రద్దు చేసే అధికారాలిచ్చే ఆర్టికల్ 85 (2) (బి)ని కూడా సవరణ చేయాల్సిన అసవరం ఉంది.
* రాష్ట్ర అసెంబ్లీల రద్దు అధికారం గవర్నర్‌కు దాఖలు పర్చే ఆర్టికల్ 174 ( 2) ( బి )కి సవరణలు.
* రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356కి సవరణలు కూడా చేయాలి.
* ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన ఆర్టికల్ 324ను సవరించాల్సి ఉంటుంది.
Read Also: PM AASHA: రూ.35,000 కోట్లతో అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్..
ఈ రాజ్యాంగ సవరణలను పార్లమెంటులో 2/3 మెజారిటీతో ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏకు 293 ఎంపీలు ఉన్నారు. జమిలి ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం.. అలాగే, రాజ్యసభలో ఎన్డీయేకు 121 బలం ఉంది.. జమిలి ఆమోదానికి 164 మంది ఎంపీల సపోర్ట్ కావాల్సి ఉంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమాఖ్య వ్యవస్థ కలిగి ఉంటడంతో దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు జమిలి ఎన్నికలకు ఒప్పకోవాల్సి ఉంటుంది. దాదాపు 14 రాష్ట్రాలకు పైగా జమిలికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతుంది. మరోవైపు మోడీ సర్కార్ వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపుతో పాటు జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉందని సమాచారం. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.