NTV Telugu Site icon

Uttar Pradesh: ఆరుగురు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీతో సంబంధం..

Up

Up

Uttar Pradesh: గత పదేళ్లుగా దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయి. కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంత మంది మళ్లీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రర్ స్వ్కాడ్ ఆరుగురు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. యూపీలోని వివిధ ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేశారు. ఆరుగురిలో నలుగురిని రకీబ్ ఇనామ్, నవేద్ సిద్ధిఖీ, మహ్మద్ నోమన్ మరియు మహ్మద్ నజీమ్‌లుగా గుర్తించారు. అరెస్టయిన నిందితులందరూ అలీఘర్ యూనివర్సిటీ విద్యార్థి సంస్థ అయిన స్టూడెంట్స్ ఆఫ్ అలీఘర్ యూనివర్సిటీ(SAMU)తో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది.

Read Also: Israel-Hamas War: ఇజ్రాయిల్ ఆర్మీని ‘ఉగ్ర సంస్థ’గా గుర్తించాలి.. ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపు..

నిందితులంతా దేశంలో పెద్ద ఉగ్రదాడికి చేయడానికి ప్లాన్ చేశారని యూపీ యాంటీ టెర్రర్ స్వ్కాడ్ వెల్లడించింది. యూపీ ఏటీఎస్ ఆరుగురిని అరెస్ట్ చేడంతో SAMU ఉగ్రవాద నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ సమావేశాలతు ఐసిస్ కొత్త రిక్రూట్మెంట్ సెల్‌గా మారాయని ఏటీఎస్ తెలిపింది. యూనివర్సిటీకి చెందిన విద్యార్థి కూడా కేంద్ర సంస్థల నిఘాలో ఉన్నట్లు తెలుస్తోంది.

పూణె ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) మాడ్యూల్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసిన రిజ్వాన్, షానవాజ్‌లను విచారించగా, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీకి చెందిన చాలా మంది విద్యార్థులు దేశ వ్యతిరేక అజెండాను వ్యాప్తి చేయడంలో నిమగ్నమై ఉన్నారని తేలింది. రిజ్వాన్‌, షానవాజ్‌లను విచారించిన యూపీ ఏటీఎస్‌ ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేసింది.