ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 9న భారత్-కివీస్ మధ్య ఫైనల్ పోరు జరుగనున్నది. టైటిలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వేళ జోరుగా బెట్టింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం దుబాయ్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్ జరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు.
Also Read:Raghunandan Rao: అక్కడ చర్చ చేద్దాం రండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రఘునందన్‌రావు సవాల్
అంతర్జాతీయ బుకీలకు భారత జట్టు ఫేవరెట్ అని బెట్టింగ్ ముఠాలను ట్రాక్ చేస్తున్న వర్గాలు తెలిపాయి. చాలా మంది బుకీలు అండర్ వరల్డ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని, ప్రతి పెద్ద మ్యాచ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బుకీలు దుబాయ్‌లో కలుస్తారని తెలిపారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’ దుబాయ్‌లో పెద్ద క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లో పాల్గొంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read:Rahul Gandhi: “రాహుల్ గాంధీనే మాకు పెద్ద ఆస్తి”.. గుజరాత్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
ఇటీవల జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్‌కు పాల్పడినందుకు పర్వీన్ కొచ్చర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లను ఉపయోగించి లైవ్ పందాలు కాస్తుండగా ఇద్దరు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బెట్టింగ్‌లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Indian Railways: ఇకపై కన్ఫామైన టికెట్ ఉంటేనే ప్లాట్‌ఫామ్ పైకి అనుమతి.. రైల్వే కీలక నిర్ణయం.
పర్వీన్ కొచ్చర్ లక్కీ.కామ్ అనే బెట్టింగ్ వెబ్‌సైట్ నుండి మాస్టర్ ఐడిని కొనుగోలు చేసి, దానితో బెట్టింగ్ ఐడీలను సృష్టించి, వాటిని పంటర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి లావాదేవీపై సిండికేట్ 3 శాతం కమీషన్ వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. పర్వీన్ కొచ్చర్ ప్రతి మ్యాచ్ లో రూ. 40 వేల లాభం పొందినట్లు విచారణలో చెప్పాడని అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం నెట్‌వర్క్ దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీలో అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు మనీష్ సహాని, యోగేష్ కుకేజా, సూరజ్, దుబాయ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారు. వారి నుంచి పోలీసులు రూ.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.