Site icon NTV Telugu

Maha Kumbh: కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం.. ఐదుగురు నేపాలీలు మృతి..

Bihar

Bihar

Maha Kumbh: మహా కుంభమేళా వెళ్లి వస్తుండగా విషాదం చోటు చేసుకుంది. శనివారం బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో కారు డివైడర్‌ని ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు నేపాలీలు మరణించారు. మధుబని నాలుగు లేన్ల బైపాస్‌లో వేగం వెళ్తున్న కారు, బైక్‌ని తప్పించబోయి డివైడర్‌ని ఢీకొట్టి బోల్తా పడింది. స్టంట్స్ చేస్తున్న బైకర్‌ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.

Read Also: Mysskin : ఆరు సంవత్సరాల తర్వాత సినిమా డైరెక్షన్ చేస్తున్న వివాదాస్పద డైరెక్టర్

ప్రమాదంతో స్కార్పియో తీవ్రంగా దెబ్బతింది. కారులో మొత్తం 9 మంది ఉండగా, ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరణించిన వారిని అర్చన ఠాకూర్, ఇందు దేవి, మంతర్ణి దేవి, బాల్ కృష్ణ ఝా ,డ్రైవర్‌గా గుర్తించారు. గాయపడిన వారిని మనోహర్ ఠాకూర్, సృష్టి ఠాకూర్, కామ్ని ఝా, దేవతరణ్ దేవి అని తేలింది. వీరంతా నేపాల్‌కి చెందినవారు.

Exit mobile version