Horrifying incident: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో దారుణం జరిగింది. చేతబడి పేరుతో ఐదుగురిని అత్యంత కిరాకతంగా హతమార్చారు. జిల్లాలోని కుంటలోని కోయిలిబెడ ప్రాంతంలోని ఎత్కల్ గ్రామంలో మంత్రాలు చేస్తున్నారని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టిచంపారు. బాధితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో మూఢనమ్మకాల వల్ల హింస చెలరేగుతోంది.
ఈ హత్యలు ఆదివారం జరిగాయి. గ్రామస్తులు అంతా కలిసి ఈ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు ధృవీకరించారు. మృతులను మౌసం కన్న(60), అతడి భార్య మౌసం బీరి(43), వీరి కుమారుడు మౌసం బుచ్చా(34), మౌసం బుచ్చా భార్య మౌసం అర్జో(32), కర్క లచ్చి(43)గా గుర్తించారు. చేతబడి చేస్తున్నారని ఆరోపించింన తోటి గ్రామాస్తులు వీరిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి మరణించేలా చేశారు.
Read Also: PM Modi: 6 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని.. ఈ రాష్ట్రాలకు ప్రయోజనం
ఈ ఘటనని జిల్లా ఎస్పీ చౌహాన్ కిరణ్ గంగారాం ధ్రువీకరించారు. ‘‘గ్రామస్తులు మూఢనమ్మకాలతో, కుటుంబంపై చేతబడి చేస్తు్న్నారని ఆరోపిస్తూ, ఈ దారుణ చర్య కోసం ఏకమయ్యారు’’ అని తెలిపారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందర్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బాధితులు కొంత కాలంగా ఇతర గ్రామస్తుల నుంచి అనుమానాలు, శత్రుత్వాన్ని ఎదుర్కొంంటున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. గ్రామంలో పలు అకారణ మరణాలకు, అనారోగ్యాలు చోటు చేసుకోవడంతో వీరిపై అనుమానం మరింత బలపడి, చేతబడి చేస్తు్న్నారని ఆరోపిస్తూ గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఇదిలా ఉంటే, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లానే కాకుండా బస్తర్ ఏరియా జిల్లాల్లో ఈ మంత్ర విద్యలు, చేతబడులు అధికంగా ఉంటాయనే మూఢనమ్మకం ఉంది.