Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో 5.3 తీవ్రతతో భూకంపం..

Earthquake

Earthquake

Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో రాష్ట్రంలోని చంబా పట్టణంలో ఈ రోజు భూకంపం వచ్చింది. చంబాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలిలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 9.30 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి భారీ నష్టం ఏర్పడలేదని తెలుస్తోంది. భూమికి దిగువన 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. అంతకుముందు ఏప్రిల్ 1న, హిమాచల్ ప్రదేశ్‌లోని చమోలి మరియు లాహౌల్ మరియు స్పితిలలో తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.

Read Also: US: ఫ్లోరిడాలో కారు ప్రమాదం.. తెలంగాణ ఫ్యామిలీకి గాయాలు.. చిన్నారి మృతి

హిమాలయాల్లో ఏదో ఒక సమయంలో భారీ భూకంపం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో హిమాలయ, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదవుతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో భూ ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరం దిశగా కదులుతూ, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్‌ని ముందుకు నెట్టడంతో, ఈ ప్రక్రియలో విడుదలయ్యే శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది. ఈ పరిణామం వల్లే ముఖ్యంగా నేపాల్‌లో తరుచుగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి.