Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో 5.3 తీవ్రతతో భూకంపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Earthquake: హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో రాష్ట్రంలోని చంబా పట్టణంలో ఈ రోజు భూకంపం వచ్చింది. చంబాకు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలిలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 9.30 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి భారీ నష్టం ఏర్పడలేదని తెలుస్తోంది. భూమికి దిగువన 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. అంతకుముందు ఏప్రిల్ 1న, హిమాచల్ ప్రదేశ్‌లోని చమోలి మరియు లాహౌల్ మరియు స్పితిలలో తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి.
Read Also: US: ఫ్లోరిడాలో కారు ప్రమాదం.. తెలంగాణ ఫ్యామిలీకి గాయాలు.. చిన్నారి మృతి
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
హిమాలయాల్లో ఏదో ఒక సమయంలో భారీ భూకంపం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కాలంలో హిమాలయ, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ తీవ్రతతో భూకంపాలు నమోదవుతున్నాయి. హిమాలయ ప్రాంతాల్లో భూ ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికలు క్రియాశీలకంగా ఉన్నాయి. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ఉత్తరం దిశగా కదులుతూ, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్‌ని ముందుకు నెట్టడంతో, ఈ ప్రక్రియలో విడుదలయ్యే శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది. ఈ పరిణామం వల్లే ముఖ్యంగా నేపాల్‌లో తరుచుగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి.
Earthquake of Magnitude:5.3, Occurred on 04-04-2024, 21:34:32 IST, Lat: 33.09 & Long: 76.59, Depth: 10 Km ,Location:Chamba, Himachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/SYNmt1ew5B @KirenRijiju @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia… pic.twitter.com/Bc2FRprnWw
— National Center for Seismology (@NCS_Earthquake) April 4, 2024
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!