గుండెపోట్లు పెద్దోళ్లకే కాదు.. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా సంభవిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మధ్య వయస్కులు ఎక్కువ మంది గుండెపోటుతో చనిపోతున్నారు. దీంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఇక కర్ణాటకలో అయితే నెలల వ్యవధిలోనే పదులకొద్దీ హార్ట్ఎటాక్తో చనిపోయారు. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం దర్యాప్తు చేయాలని వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా చిన్న పిల్లలు కూడా చనిపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కళ్ల ముందు కనిపించిన వారు.. అంతలోనే విగతజీవులుగా మారడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
ఇది కూడా చదవండి: Nitish Kumar: ఎన్నికల ముందు నితీష్ వరాలు.. 125 యూనిట్ల విద్యుత్ బిల్లు కట్టొద్దని ప్రకటన
తాజాగా రాజస్థాన్‌లో 4వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థిని గుండెపోటుతో చనిపోవడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సికార్‌లోని దంతా పట్టణంలో ప్రాచి కుమావత్(9) అనే 4వ తరగతి విద్యార్థిని స్కూల్‌కు వచ్చింది. ఉదయం ప్రార్థనలు, అసెంబ్లీలో చురుగ్గానే పాల్గొంది. మధ్యాహ్నం భోజన సమయంలో హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. వెంటనే పాఠశాల స్పందించి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలిక ప్రాణాలు వదిలింది. గుండెపోటుతో బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. దీంతో పాఠశాల సిబ్బందితో పాటు తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు ఏంటి? అని తల్లడిల్లిపోయారు. మంగళవారం ఉదయం ఆరోగ్యంగా ఉన్న బాలిక.. అంతలోనే చనిపోవడం పాఠశాల సిబ్బందిని కలవరపాటుకు గురి చేసింది.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: టేకాఫ్ ముందు ఇంధన స్విచ్‌లు బాగానే ఉన్నాయి.. అంతలోనే ఎలా ఆగాయి? దీనిపైనే ప్రత్యేక ఫోకస్..!
ఇదిలా ఉంటే బాలిక స్పృహ తప్పి పడిపోగానే ఉపాధ్యాయులు వెంటనే స్పందించారు. దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారిని బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కానీ చిన్నారి అప్పటికే పల్స్ కోల్పోయింది. వెంటనే రక్తపోటు పడిపోయింది. ఊపిరి ఆడటం లేదని గమనించడం.. వెంటనే గుండె ఆగిపోయి కళ్లముందే ప్రాణాలు వదిలింది. దీంతో అంతా నిర్ఘంతపోయారు.
ఇది కూడా చదవండి: Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ వార్నింగ్.. ఈసారి కాలు దువ్వితే..!
చిన్నారి రెండు, మూడు రోజులుగా స్వల్ప జలుబు కారణంగా పాఠశాలకు రాలేదని ఆదర్శ్ విద్యా మందిర్ పాఠశాల ప్రిన్సిపాల్ నంద్ కిషోర్ తివారీ మీడియాకు తెలిపారు. పాఠశాలకు వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించిందన్నారు. ఉదయం ప్రార్థనలు మరియు అసెంబ్లీలో కూడా పాల్గొందని.. భోజన సమయంలో స్పృహ కోల్పోయిందని వివరించారు. ఇక చిన్నారిని బతికించడానికి దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌ఛార్జి వైద్యుడు డాక్టర్ ఆర్కె జాంగిద్ తెలిపారు. గుండెపోటు కారణంగానే చనిపోయిందని చెప్పారు. పుట్టికతో వచ్చిన గుండెపోటు అయి ఉండొచ్చని పేర్కొ్న్నారు. ఇక పాఠశాల సీసీటీవీ లో రికార్డైన దృశ్యాల్లో చాలా చలాకీగా.. నవ్వుతూ కనిపించింది. కానీ అంతలోనే మృత్యువు కబళించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.