ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది.. ఏడాది కూడా చిన్నారిని ఎందుకు చంపడం అనుకున్నారో ఏమో.. 9 నెలల చిన్నారిని వదిలేసి అంతా ఉరివేసుకున్నారు.. కానీ, ఆ ఇంట్లో ఎవరూ లేరు.. ఏం చేయాలి..? ఏం తినాలి..? ఏమీ తెలియని ఆ చిన్నారి ఐదు రోజుల పాటు ఆకలితో అలమటించిపోయింది… ఇంట్లో వేలాడుతోన్న మృతుదేహాల మధ్య ఆకలితో అలమటించి.. ఏడుస్తూ.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.. ఈ హృదయ విదారకమైన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బైడరహల్లి ప్రాంతంలో ఒక ఇంట్లో నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఒకే కుటుంబానికి చెందిన తల్లి సించన, అమ్మమ్మ భారతి, తల్లి సోదరి సింధూరాణి, తల్లి సోదరుడు మధుసాగర్ ఉరివేసుకున్నారు.. మృతదేహాలు కుల్లినస్థితిలోకి వెళ్లిపోయాయి.. అనుమానం వచ్చిన బంధువులు ఐదు రోజుల తర్వాత ఇంటి తలపులను తెరడంతో.. ఇంటి పైకప్పుకు వేలాడుతూ మృతదేహాలు కనిపించాయి.. అయితే, మధుసాగర్ ఉరి వేసుకున్న గదిలో ఓ బాలిక ఐదు రోజుల పాటు ఆకలితో అలమటిస్తూ అపస్మారక స్థితిలో కనిపించింది. దీంతో.. పోలీసులు బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అందరినీ కలచివేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.